మార్చి, ఏప్రిల్ నెలల్లో జీవిత బీమా పాలసీ ప్రీమియం చెల్లించాల్సిన పాలసీదారులకు ఊరటనిచ్చేవార్త ఇది. ప్రీమియం చెల్లించే గడువును మరో 30 రోజులు పొడిగిస్తూ ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) సర్క్యులర్ జారీ చేసింది. దేశమంతా 21 రోజుల లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో అన్ని రంగాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా రోజురోజుకూ పెరుగుతున్న వైరస్‌వ్యాప్తి కారణంగా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఐఆర్‌డీఏఐ పేర్కొంది. ఇదివరకే మార్చి నెలలో ప్రీమియం చెల్లించాల్సి ఉన్న వారికి గ్రేస్ పిరీయడ్ ఇస్తూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ వ్యవధిని పొడగించడమే కాకుండా ఏప్రిల్ నెలలో ప్రీమియం చెల్లించాల్సి ఉన్న పాలసీదారులకు కూడా వెసులుబాటు కల్పిస్తూ సర్క్యూలర్ జారీ చేసింది. దీని ప్రకారం ఆలస్యంగా చెల్లించే ప్రీమియంపై ఎలాంటి ఛార్జీలు, వడ్డీలు వర్తించవు. నిర్ణయించిన గడువును దృష్టిలో ఉంచుకుని పాలసీదారులు తమ తమ ప్రీమియం చెల్లించవచ్చు. ఇందుకు సంబంధించి ఆయా బీమా సంస్థలకు కూడా సూచనలు వెళ్లాయి. పాలసీదారులకు వ్యక్తిగతంగా సంక్షిప్త సందేశాలుగానీ, మరేవిధంగానైనా గానీ సమాచారం అందనుంది.
అంతేకాకుండా ఐఆర్‌డీఏఐ 25వ రెగ్యులేషన్ (లింక్డ్ ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్ -2013) అనుసరించి ఒకేసారి చెల్లించే ఫండ్‌వ్యాల్యూ, మెచ్యురిటీ పూర్తయిన యూలిప్ పాలసీలును ఆయా బీమా సంస్థలు పాలసీదారులతో సంప్రదింపులు జరిపి సెటిల్మెంట్ ఆప్షన్‌కు వెళ్లేందుకు కూడా వీలుందని పేర్కొంది. యూలిప్ పాలసీదారులకు అవసరమైన సూచనలు కూడా ఆయా వెబ్‌సైట్లలో ఉంటాయని, 2020 మే 31 తేదీ వరకూ యూలిప్ పాలసీ మెచ్యూరిటీ పూర్తయ్యేవారికి ఈ మినహాయింపు ఉంటుందని తెలిపింది. వన్ టన్ సెటిల్మెంట్ సదుపాయం ఉందని, ఫండ్ వాల్యూతో సంబంధం లేకుండా, ఆ రోజు ఎన్ఏవీ విలువలో పెరుగుదల, తగ్గుదల, ఇతర నిర్ణీత అంశాలను ఆధారంగా చేసుకొని బీమా సంస్థలు ఈ ఆప్షన్ తీసుకోవచ్చని, పాలసీదారులు మరింత సమాచారం కోసం బీమా సంస్థల కాల్ సెంటర్ల ద్వారా సంప్రదించవచ్చని శనివారం విడుదల చేసిన సర్క్యులర్‌లో ఐఆర్‌డీఏఐ పేర్కొంది.

0 Comments:
Post a Comment