16 కల్లా ప్రమాణ పత్రం దాఖలు చేయండి
ఎస్‌ఈసీ అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు
అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని కుదిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్, జీవోలపై హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 16కల్లా ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలన్ని కుదిస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్, జీవోలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అనంతరం మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజును ఎస్‌ఈసీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించడంతో ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు.

0 Comments:
Post a Comment