కేరళ: పెళ్లంటె ఎంత హడావిడి. ఎంత బిజీ బిజీ. కానీ ఆమె మాత్రం పెండ్లి బట్టలతోనే హాస్పిటల్‌కు వచ్చింది. కరోనా బారిన పడిన పేషెంట్లకు వైద్యం అందించింది. కేరళకు చెందిన డాక్టర్ షఫీ మహమ్మద్ వైద్యురాలు. ఆమెకు మార్చి 29న దుబాయ్‌కు చెందిన ఓ వ్యాపారి తో వివాహం నిశ్చయమైంది. కానీ తనకు తన పెండ్లికన్నారోగులకు సేవ చేయడమే ముఖ్యమని ఆమె నిర్ణయించుకున్నది. ఇదే విషయం తన కుటుంబీకులకు, కాబోయే భర్తకు చెప్పింది. వారంతా ఆమె నిర్ణయాన్ని గౌరవించి పెండ్లిని వాయిదా వేశారు. దాంతో ఆదివారం ఆమె కన్నూర్‌లోని పెరియారం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులోని కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నది. పెండ్లి బట్టలతోనే రోగులకు వైద్యం అందించడం అక్కడున్న వారందరినీ కలిచివేసింది.
0 Comments:
Post a Comment