న్యూఢిల్లీ: ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా బ్యాంకులు కస్టమర్లకు ఈఎంఐ చెల్లింపులను మూడు నెలలు వాయిదా వేసినా ఆ కాలానికి వడ్డీభారం తప్పదని బ్యాంకులు స్పష్టం చేశాయి. ఈ మారటోరియంతో రుణగ్రహీతలకు ప్రయోజనం అంతంత మాత్రమేనని విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులిప్పటికే తమ కస్టమర్లకు ఈ వెసులుబాటును కల్పించాయి. దేశీయ బ్యాంకింగ్ రంగంలో మూడింట రెండొంతుల మార్కెట్ వాటా వీటిదే. ప్రైవేట్ బ్యాంక్‌లు సైతం ఈఎం ఐ హాలిడే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. కాగా మూడు నెలలకు మారటోరియం ఎంచుకునే గృహ, వాహన రుణ కస్టమర్లకు కావాలనుకుంటే మార్చిలో చెల్లించిన ఈఎంఐని రిఫండ్ చేస్తామని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ప్రకటించింది.
వడ్డీ భారం ఎంత పెరుగుతుందంటే..
రూ.30 లక్షల గృహ రుణం మరో 15 ఏళ్లు చెల్లించాల్సి ఉందనుకుందాం. మారటోరియం ఎంచుకునే వారిపై నికరంగా రూ.2.34 లక్షల అదనపు వడ్డీ భారం పడుతుంది. ఈ మొత్తం 8 ఈఎంఐలతో సమానం.
రూ.6 లక్షల వాహన రుణం ఇంకా 54 నెలలు చెల్లించాల్సి ఉంటే అదనపు వడ్డీ రూ.19,000 అవుతుంది. అంటే, ఒకటిన్నర ఈఎంఐలతో సమానం.
ఆప్ట్ ఇన్.. అప్ట్ అవుట్
ప్రభుత్వ రంగ బ్యాంకులు మారటోరియాన్ని ఆప్ట్ అవుట్ ఆప్షన్‌తో ప్రకటించగా.. పలు ప్రైవేట్ బ్యాంక్‌లు ఆప్ట్ ఇన్ ఆప్షన్‌తో ప్రకటించాయి. రుణగ్రహీతలు తమ బ్యాంక్ ఏ ఆప్షన్‌తో మారటోరియాన్ని ప్రకటించిందనేది జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఆ ఆప్షన్ బట్టే కస్టమర్ ఏం చేయాల్సి ఉంటుందనేది ఆధారపడి ఉంది.
ఈ ఆప్షన్ల వివరాలు.....
అప్ట్ ఇన్
ఈ అప్షన్‌లో మారటోరియం ఎంచుకోవాలనుకునే కస్టమర్లు నిర్దేశిత మార్గం (ఫోన్/ మెయిల్/ఆన్‌లైన్/బ్యాంక్ బ్రాంచ్) ద్వారా బ్యాంక్‌ను సంప్రదించాలి. అప్పుడే మారటోరియం వెసులుబాటు లభిస్తుంది. చెల్లింపుల వాయిదా వద్దనుకుంటే మాత్రం ఏం చేయనక్కర్లేదు.
అప్ట్ అవుట్
ఈ ఆప్షన్‌లో బ్యాంక్ తన కస్టమర్లకు ఈఎంఐ చెల్లింపుల మారటోరియాన్ని ఆటోమెటిక్‌గా వర్తింపజేస్తుంది. మారటోరియం వద్దనుకున్నప్పుడే కస్టమర్ బ్యాంక్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

0 Comments:
Post a Comment