ఈనాడు, దిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)లో భారత్ కీలక పాత్ర పోషించనుంది. ఈ సంస్థ కార్యనిర్వాహక మండలి అధ్యక్ష బాధ్యతలను మే 22న భారత ప్రతినిధి చేపట్టనున్నారు. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. మరోవైపు- డబ్ల్యూహెచ్‌వో కార్యక్రమ వార్షిక ప్రణాళిక, పాలన మండలిలోనూ భారత్ చోటు దక్కించుకోనుంది. కరోనా మహమ్మారిపై ప్రపంచాన్ని జాగృతం చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఫల్యం చెందిందన్న విమర్శల నేపథ్యంలో... భారత్ కీలక బాధ్యతలను చేపట్టనుండటం విశేషం. 34 మంది సభ్యులు, ఒక అధ్యక్షుడు ఉండే ఈ కార్యనిర్వాహక మండలిని వచ్చే నెల 18న వరల్డ్ హెల్త్ అసెంబ్లీ (డబ్ల్యూహెచ్‌ఏ) లాంఛనంగా ఎన్నుకోనుంది. ఈ సభ తీసుకునే నిర్ణయాలను కార్యనిర్వాహక మండలి అమలుచేయడమే కాకుండా, డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్‌కూ పలు అంశాల్లో మార్గనిర్దేశనం చేస్తుంది. తదుపరి డైరెక్టర్ జనరల్‌ను నియమించే విషయంలోనూ భారత్ కీలకపాత్ర పోషించనుంది.
భారత్‌కు డబ్ల్యూహెచ్‌వోలో కీలక బాధ్యతలు

0 Comments:
Post a Comment