ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీలకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూల్స్ అడ్మిషన్స్ సమయంలో కేవలం ఒక త్రైమాసిక ఫీజు మాత్రమే తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది ఫిక్స్ చేసిన ఫీజుల ఆధారంగానే మొదటి త్రైమాసిక ఫీజుల వసూలు చేయాలని తెలిపింది. ప్రస్తుతం కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా ప్రజలు పలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల వినతి మేరకు స్కూళ్లు, కాలేజీల ఫీజులను చెల్లించేందుకు ఇన్‌స్టాల్మెంట్స్ సదుపాయం కల్పించాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. మొదటి త్రైమాసిక ఫీజు రెండు విడతలగా కట్టించుకోవలని సూచన చేసింది. అలాగే రెండు విడతలకు కనీసం 45 రోజుల వ్యవధి ఇవ్వాలని ఏపీ పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ ఆదేశాలు జారీ చేశాయి.
Inka march month salaries ivaledhu private school
ReplyDeleteAvi avaru chustharu
Veellu salaries matram ivvaru
ReplyDeletePapam
ReplyDelete