తేది:16/4/2020
వార్త దినపత్రికలో విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు గురించి నేను రాసిన ఆర్టికల్
****
జూమ్ యాప్ ఆన్లైన్ శిక్షణా తరగతులు సురక్షితమేనా..
****
కరోనా నేపథ్యంలో చాలా దేశాలలో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, అన్ని రకాల విద్యా సంస్థలు, కార్యాలయాలు మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షలు వాయిదా పడ్డాయి. విద్యా సంస్థలు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా అనేక దేశాలలో, మరియు మనదేశంలో కూడా ఆన్లైన్ తరగతులు నిర్వహించడం ప్రారంభించారు. ఆన్లైన్ తరగతులు నిర్వహించడానికి ఇటీవలి కాలంలో కార్పోరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు జూమ్ యాప్ ను వినియోగిస్తున్నాయి. జూమ్ యాప్ మొబైల్ మరియు విండో బేస్డ్ యాప్ అంటే కంప్యూటర్, మొబైల్ ఫోన్ లలో వినియోగించ డానికి వీలవుతుంది. ఈ యాప్ ప్లే స్టోర్ నుంచి జూమ్ క్లౌడ్ మీటింగ్స్ అనే పేరు తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ఇన్స్టాల్ చేసుకుని వినియోగించు కోవచ్చు. దీని ద్వారా విద్యా సంస్థలు ఆన్లైన్ తరగతులు నిర్వహించడానికి, ఉద్యోగుల సమావేశాలు నిర్వహించడానికి, వర్క్ ఫ్రమ్ హోమ్ కొరకు, టీచర్లు లెక్చరర్లు తమ ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి వీలవుతుంది. ఇందులో వీడియో కాన్ఫరెన్స్, లైవ్ స్ట్రీమింగ్ చాటింగ్ లాంటి అనేక రకాలయిన సౌకర్యాలు ఉన్నాయి. దీన్ని వినియోగించడం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు చాలా తేలిక. అందువల్లనే ప్రస్తుతం దీన్ని వినియోగించే చాలా స్కూళ్లు, కాలేజీలు, యోగా సంస్థలు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తుండగా, కొన్ని మత సంస్థలు కూడా తమ ప్రేయర్స్ కోసం దీన్ని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.
వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ‘జూమ్’లో భద్రతా లోపాలకు సంబంధించి గత కొద్ది రోజులుగా వార్తలు వస్తుండగా, తాజాగా సింగపూర్‌లో మరో ఘటన వెలుగుచూసింది. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆగంతకులు తెరపై ప్రత్యక్షమై అసభ్యకరంగా ప్రవర్తించారని తెలుస్తోంది. దాంతో ఆ యాప్‌ను తమ ఉపాధ్యాయులు వాడకుండా సస్పెండ్ చేస్తున్నట్లు సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు సంబంధించి ఈ సంస్థ తన యాప్‌లో డీఫాల్ట్ సెట్టింగులను మార్చింది. భత్రతను ఎలా పెంచుకోవాలో చెబుతూ ఉపాధ్యాయులకు కొన్ని సూచనలు చేసింది. ఆన్‌లైన్ తరగతులు సురక్షితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యాప్ నందు హ్యాకర్లు ప్రవేశిస్తున్నందున అది అంత సులువు కాదని అర్థమవుతోంది. ఈ యాప్ ద్వారా ఆన్లైన్ తరగతులు సురక్షితం కాదని తెల్సుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనల్లో ఆన్‌లైన్ క్లాసులోకి హ్యాకర్లు ఎలా ప్రవేశించారన్నది ఇంకా తెలియడంలేదు. జూమ్ మీటింగ్స్‌కు 9 అంకెల యూజర్ ఐడీ ఉంటుంది. ఈ యాప్‌లో సెక్యూరిటీ సెట్టింగ్స్ సరిగా లేకుంటే, మీటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు కూడా అందులో ప్రత్యక్షమయ్యే ప్రమాదం ఉంటుంది. దీనిపై సింగపూర్ ప్రభుత్వం ఏమంటోందంటే? ఇది అత్యంత హేయమైన సంఘటన అని, దీనిపై దర్యాప్తు జరిపిస్తున్నామని, అవసరమైతే పోలీసు కేసు నమోదు చేస్తామని సింగపూర్ విద్యాశాఖ తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా, ఈ భద్రతా లోపాలను సవరించే వరకూ ఉపాధ్యాయులెవరూ జూమ్ అప్లికేషన్‌ను వాడొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఆన్‌లైన్ తరగతులు సురక్షితంగా ఉండేందుకు ఉపాధ్యాయులందరూ తమ లాగిన్ ఐడీలను కఠినతరం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. జూమ్ స్పందన ఏమిటంటే? ఈ సంఘటన పట్ల తీవ్రంగా చింతిస్తున్నామని, ఇలాంటి ఘటనలు జరిగితే నేరుగా జూమ్‌కు నివేదించాలని వినియోగదారులను కోరారు. తగిన చర్యలు తీసుకొంటున్నామని చెబుతున్నారు. భద్రతను పెంచేందుకు యాప్‌లో డీఫాల్ట్ సెట్టింగులను మార్చామని, ఆన్‌లైన్ తరగతుల నిర్వాహకులకు ప్రత్యేక సూచనలు కూడా చేశామని ఆ సంస్థ తెలిపింది. జూమ్ హ్యాక్ కావడం ఇదే మొదటిసారా? అని విశ్లేషిస్తే, జూమ్ అనేది ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్. 2013లో ఈ అప్లికేషన్ విడుదలైంది. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. దాంతో, జూమ్ వాడకం భారీగా పెరిగింది. గత ఏడాది వరకు, రోజువారీ వినియోగదారుల సంఖ్య కోటి దాకా ఉండేది. ఈ ఏడాది మార్చిలో, ఆ సంఖ్య ఇరవై కోట్లు దాటిపోయింది. ఒక్కసారిగా వినియోగం పెరగడంతో, ప్రపంచవ్యాప్తంగా కాన్ఫరెన్సులను దుండగులు హైజాక్ చేస్తున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల అమెరికాలోని ఓ పాఠశాలలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు తెరపైకి వచ్చి జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. పెన్సిల్వేనియాలో జరిగిన ప్రభుత్వ వీడియో కాన్ఫరెన్సులో అశ్లీల చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామని, తొంబై రోజుల్లో లోపాలను గుర్తించి, సరిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని జూమ్ సంస్థ తెలుపుతోంది. ఇటీవలి కాలంలో జూమ్ భారతదేశంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన ఆండ్రాయిడ్ అప్లకేషన్ అయ్యింది, వాట్సాప్, టిక్‌టాక్‌ను దాటే స్థాయికి జూమ్ చేరింది. ఇప్పుడు జూమ్ భారతదేశంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన అండ్రాయిడ్ యాప్. వాట్సాప్ వాడకం పెరిగినప్పటికీ ఐదవ స్థానానికి పడిపోయింది. సిలికాన్ వ్యాలీ ఆధారిత స్టార్టప్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో చార్టుల్లో అగ్రస్థానానికి చేరుకున్న వీడియో కాన్ఫరెన్సింగ్ అప్లికేషన్. గూగుల్ ప్లే స్టోర్‌లో వాట్సాప్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి పలు ప్రసిద్ధ వినోద అప్లికేషన్లను జూమ్ అధిగమించింది. జూమ్ యొక్క ఫ్రి వర్షన్ నలభై మంది పాల్గొనేవారు వీడియో కాన్ఫరెన్స్ కాల్‌లో చేరడానికి అనుమతిస్తుంది. ఇప్పుడున్న ప్రో వర్షన్ లో వంద మంది వరకు వీడియో కాన్ఫరెన్స్ కాల్ లో చేరడానికి వీలవుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం మార్కెట్లో పది మందికి పైగా కాల్‌లో చేరడానికి అనుమతించే ఏకైక అప్లికేషన్ జూమ్. కరోనావైరస్ మహమ్మారి నుండి ఎంతో లాభం పొందిన టెక్ కంపెనీలలో జూమ్ ఒకటి. ఇంటి నుండి ఎక్కువ మంది వ్యక్తులు పనిచేస్తుండటంతో, రిమోట్ వర్కింగ్ మరియు వీడియో కాన్ఫరెన్సింగ్ సాఫ్ట్‌వేర్‌లలో ప్రత్యేకత ఉన్నందున జూమ్ అందరికీ అవసరమయిన అప్లికేషన్ అయింది. దీనిలో ఉన్న భద్రతా ప్రమాణాల లోపాల వలన గూగుల్ సంస్థ తమ ఉద్యోగులు జూమ్ యాప్ ఉపయోగించరాదని ఆజ్ఞలు విధించారు. గూగుల్ తమ సంస్థల్లో జూమ్ యాప్ ను వినియోగించుకోవడానికి అనుమతి లేదు, నిషేధించారు. అదేవిధంగా జర్మనీ కూడా జూమ్ యాప్ ను నిషేధించింది. ఇప్పుడు భారతదేశంలో జూమ్ యాప్ ను అధికంగా వినియోగిస్తునందున, ఇది ఎంత వరకు సురక్షితమైనదో నిపుణులు, ప్రభుత్వం తెల్చాల్సిన అవసరం ఎంతయినా ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఉన్న భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దీన్ని వినియోగించే ఉపాధ్యాయులకు, విద్యార్థులకు భద్రతా ప్రమాణాలు పాటించేలా తగిన సాంకేతిక పరమైన శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత విద్యా సంస్థల యాజమాన్యాల మీద ఉంది.
- వాసిలి సురేష్
9494615360

0 Comments:
Post a Comment