తేది:8/4/2020
ప్రజా పాలన దినపత్రికలో ఉపాధ్యాయులకు ఆన్లైన్ శిక్షణా కార్యక్రమాల గురించి నేను రాసిన ఆర్టికల్
ఉపాధ్యాయులకు ఆన్లైన్లో శిక్షణ విజయవంతం
అయ్యేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో టీచర్లకు ఆన్లైన్ పాఠాలు నిర్వహించడం కోసం బోధ్ శిక్షాలోకమ్ అనే యాప్ ను ఉపాధ్యాయులకు అందుబాటులోకి తెచ్చింది. ఇందులో లెర్నింగ్ మెటీరియల్, వీడియోలు, ఆన్లైన్ టెస్టులు ఉంటాయి. దీని ద్వారా జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలను ఎస్సీఈఆర్టీ రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాబోవు విద్యా సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఆంగ్ల భాష నైపుణ్యాలు పెంపొందించాలని భావించింది. అందుకోసం కాంప్రేహెన్సివ్ లెర్నింగ్ ఎన్హెన్స్మెంట్ ప్రోగ్రామ్ అనే పేరుతో రాష్ట్రంలోని అన్నీ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఫిబ్రవరి నెలలో విడతల వారీగా ఉపాధ్యాయులందరికీ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది. అదేవిధంగా విద్యార్థులను ఇంగ్లిష్ మీడియం కోసం సిద్ధం చేయడం కోసం మార్చి, ఏప్రిల్ నెలల్లో బ్రిడ్జి కోర్సు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. కానీ కరోనా నేపథ్యంలో తప్పనిసరి పరిస్థతుల్లో అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. దానితో విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు కార్యక్రమం ఆగిపోయింది. కానీ ఉపాధ్యాయులకు సబ్జెక్టు ట్రైనింగు కార్యక్రమాలు వేసవి సెలవుల్లో చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇండ్లలో ఉంటున్న ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలను అమలు చేయాలని ఆలోచనతో ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఆన్లైన్ శిక్షణా కార్యక్రమాలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు తమ ఆంగ్ల భాష, ఆంగ్ల బోధనా నైపుణ్యాన్ని, పరిజ్ఞానాన్ని మరింత మెరుగుపర్చుకొనేందుకు వీలుగా పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్ పాఠాలను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం లెర్నింగ్ మెటీరియల్, వీడియోలతో పాటు ఆన్లైన్ టెస్టులతో 'బోద్ శిక్షా లోకమ్' మొబైల్ అప్లికేషన్ రూపొందించింది. టీచర్లంతా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని స్వయం అభ్యసనాన్ని చేపట్టేలా డీఈఓలు, డైట్ ప్రిన్సిపాళ్లు, అకడమిక్ పర్యవేక్షణాధికారులు, మండల విద్యాధికారులు, రిసోర్సుపర్సన్లు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యాప్ ను గూగుల్ ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. ఉపాధ్యాయుల ట్రెజరీ ఐడీ సహాయంతో లాగిన్ అవ్వాలి. ఇందులోని ముప్ఫై రోజులపాటు ఆన్లైన్ శిక్షణను ఉపాధ్యాయులు పూర్తి చేయాలి. డీఈఓలు ఈ కోర్సు అడ్మినిస్ట్రేటివ్ ఇనార్జులుగా, డైట్ ప్రిన్సిపాళ్లు కోర్సు పర్యవేక్షణాధికారులుగా వ్యవహరిస్తారు. రిసోర్స్ పర్సన్ జిల్లా ఇన్‌చార్జిగా ఉంటూ డీఈఓలు, ప్రిన్సిపాళ్ల ఆధ్వర్యంలో పనిచేస్తారు. స్టేట్ రిసోర్సుపర్సన్లు జిల్లా రిసోర్సు పర్సన్లతో ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి, అందులో డీఆర్పీలు ఎంఈఓల ద్వారా టీచర్లందరితో బృందాలుగా ఏర్పరచి, వీరికి ఎప్పటికప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ను వాట్సాప్ గ్రూపుల ద్వారా అందించడం జరుగుతుంది. ఉపాధ్యాయులు ఇంట్లో సమయాన్ని శిక్షణకు ఉపయోగించుకోవటానికి, ఒక స్వీయ అభ్యాసానికి వీలుగా ఈ యాప్లోని మాడ్యూళ్లను రూపొందించారు. వాట్సాప్ గ్రూపులలోని టీచర్లు, ఇతరులకు సంబంధించిన కార్యకలాపాలపై రోజువారీ డాష్ బోర్డ్ భాగస్వామ్యం ఉంటుంది. తమకు ఈ స్వీయ అభ్యసనం ద్వారా పరిజ్ఞానం ఏమేరకు మెరుగుపడిందో టీచర్లు తమంతట తామే అంచనా చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. మార్చి 23 నుంచి ప్రారంభమైన ఆన్లైన్ శిక్షణా కార్యక్రమం ఏప్రిల్ 21వరకు ముప్ఫై రోజులపాటు కొనసాగుతుంది. ఉపాధ్యాయులు ఇందులో రోజువారీగా ఇవ్వబడిన అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రతీ రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఆరోజు అధ్యయనం చేసిన అంశం మీద ఆన్లైన్ టెస్ట్ రాయవలసి ఉంటుంది. ఉపాధ్యాయులు రోజువారీ అంశాలు అధ్యయనం, మరియు ఆన్లైన్ పరీక్ష కోసం మూడు నుంచి నాలుగు గంటల సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉపాధ్యాయులు బోధ్ శిక్షా లోకం యాప్ లో లాగిన్ అయ్యి అందులోని రోజువారీగా అంశాలను ఉపాధ్యాయులు అధ్యయనం చేసి ఆన్లైన్ పరీక్షలు రాసేలా రిసోర్స్ పర్సన్లు మరియు విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. లాగిన్‌కు సంబంధించిన ఏవైనా ప్రశ్నలు, సమస్యలు ఉపాధ్యాయులు తెలియజేస్తే వాటిని సరిదిద్దడానికి తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఉపాధ్యాయ శిక్షణను డిజిటల్ విప్లవంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. కానీ ఇది విజయవంతం కావాలంటే ఉపాధ్యాయుల పూర్తి మద్దతు, సహకారం ప్రభుత్వానికి అవసరమవుతుంది. మార్చి నెల 23 నుండి ప్రతిరోజూ కవర్ చేయబడే విషయాలు మరియు అధ్యయన లింకులు ఆధారంగా ఉపాధ్యాయులు విషయాలను అధ్యయనం చేసి, పరీక్షలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. దీనిలో ప్రతిరోజూ ఉపాధ్యాయులందరూ టాపిక్ కోసం వాట్సప్ ను ఉపయోగించి రిసోర్స్ లింకును చదవాలి, అంశానికి సంబంధించిన పరీక్షకు సమాధానం ఇవ్వాలి, రోజుకు కేటాయించిన వెబ్నార్ను చూడాలి, వెబ్నార్ వీడియోకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అంతేగాక ఆంధ్రప్రదేశ్ ఎస్సీఈఆర్టి లింక్ నుండి ప్రతిరోజూ ఒక లాంగ్వేజ్ గేమును చూడాలి. తద్వారా ఉపాధ్యాయులు తమ నైపుణ్యాన్ని, పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఈ విధానంలో ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం లో అనేక ప్రయోజనాలతోపాటు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఉపాధ్యాయులందరూ తమ ట్రెజరీ ఐడి ద్వారా లాగిన్ అవుతారు కాబట్టి ఏ ఒక్క ఉపాధ్యాయుడు శిక్షణ నుంచి తప్పించుకునేందుకు వీలుకాదు. ఎవరయితే శిక్షణకు దూరంగా ఉన్నారో వారి వివరాలు ప్రభుత్వం దగ్గర ఆన్లైన్లో ఉంటాయి. వీటి కోసం అధికారుల మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ప్రభుత్వం తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేసేందుకు వీలవుతుంది. అధిక శాతం ఉపాధ్యాయులకు ఇంటర్నెట్ వినియోగం, ఆన్లైన్ కోర్సు పూర్తి చేసేందుకు తగిన అవగాహన ఉన్నప్పటికీ, వీటిపై ఉపాధ్యాయులందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉంది. వీటిలో ప్రతీ ఉపాధ్యాయుడు పాల్గొనేలా చూడటం, నిరంతర పర్యవేక్షణ, ఉపాధ్యాయులకు తలెత్తే సందేహాలు నివృత్తి చేసేందుకు తగిన రిసోర్స్ పర్సన్లను అందుబాటులో ఉంచడం వల్ల ఉపాధ్యాయులకు ఈ ఆన్లైన్ శిక్షణా కార్యక్రమాలను విజయవంతం చేయాలి.
- వాసిలి సురేష్
9494615360

0 Comments:
Post a Comment