తేది:6/4/2020
వార్త దినపత్రిక లో నేను రాసిన ఆర్టికల్
***
"సమస్యలతో సగటు ఉద్యోగి సతమతం"
***
కరోనా ప్రభావం తెలుగు రాష్ట్రాలలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని యోచన చేస్తుండగా, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా జీతాల్లో కోత విధించాలని చూస్తోంది. లాక్డౌన్ ను అమలు చేయడం వల్ల దాని ప్రభావం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధపై పడిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తన దగ్గరున్న నిధులను కరోనా వైరస్ నిరోధానికి ఖర్చు పెడుతోందని, ఉద్యోగులకు మొదట సగం జీతం ఇచ్చి, ఆ తరువాత నిధులు సమాకూరిన తర్వాత మిగతా జీతం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద ఉద్యోగుల వేతనాల్లో యాభై శాతం కోత విధించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ ప్రభావం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిందని, ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేతనాల చెల్లింపులపై కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాల్గవ తరగతి, పొరుగు నేవలు, ఒప్పంద ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తున్నట్లు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తున్నట్లు, అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధిస్తున్నట్లు, అన్ని రకాల విశ్రాంత ఉద్యోగుల పింఛన్లో 50 శాతం కోత విధిస్తున్నట్లు, మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద యాభై శాతం వరకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తున్నట్లు అర్థమవుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలే తీసుకుంటున్నది, అందులో భాగంగా మార్చి నెలలో ప్రజాప్రతినిధుల వేతనాల్లో 65శాతం, ఏ గ్రేడ్, బీ గ్రేడ్ అధికారుల జీతాల్లో 50 శాతం, సి గ్రేడ్ ఉద్యోగుల జీతాలలో 20 శాతం కోత విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు జీతాల్లో కోత విధించడం మీద ఉద్యోగ సంఘాల నాయకులు, నిపుణులు ఏమంటున్నారంటే ఇప్పుడున్న పరిస్తితి ఆర్థిక అత్యవసర పరిస్థితి కాదని, ఐఎఎస్, ఐపిఎస్ లాంటి అఖిల భారత సర్వీసుల జీతాలను కోత విధించడం అనేది చాలా తీవ్రమైన విషయమని, వారికి జీతభత్యాలకు సంబంధించిన విషయాలు రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదని, కేంద్ర విషయాలకు సంబంధించి రాష్ట్రం ఇలాంటి చర్యలు తీసుకోవడం చాలా తీవ్రమైన విషయమని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని అంతే కాకుండా ఇలాంటి ఉద్యోగుల జీతభత్యాలలో కోతలు విధించడం లాంటి చర్యలు సగటు ఉద్యోగులు జీవించే అవకాశాలను కూడా తీవ్రంగా దెబ్బ తీయడమే అవుతుందని, ఆర్టికల్ 21 కు ఇటువంటి నిర్ణయం విరుద్ధమని జీతాలకు సంబంధించిన ఒప్పందాలన్నీ కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఎప్పుడంటే అప్పుడు తగ్గించేందుకు వీలుకాదని, దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడిన సందర్భంలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. అప్పుడు రాష్ట్ర అంశాల అన్నిటి మీద కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణమైన అధికారాలు ఉంటాయని, మిగిలిన సందర్భాలలో ఉద్యోగుల జీతాలతో కోతలు విధించడం సాధ్యం కాదని, భారత రాజ్యంగం ఆర్టికల్ 360 ,4(ఎ)ఐ, 1949 ప్రకారం దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినపుడు మాత్రమే ఉద్యోగుల జీతాల్లో కోత విధించే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుంది. అప్పులు తీర్చే సందర్భంలో కూడా కోర్టులు ఉద్యోగి జీతం నుండి మినహాయింపులు మొత్తం జీతంలో మూడవ వంతు దాటరాదని కుటుంబపోషణ నిమిత్తం మిగిలిన దానిని వదలి వేయాలని తీర్పులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే సగం జీతం మాత్రమే ఎలా ఇస్తారని ప్రభుత్వ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కోతలు విధించే విధమయిన ఆర్థిక అత్యవసర పరిస్థితి ఇప్పుడు మనదేశంలో లేదని, ఉద్యోగుల జీతాలు ఎటువంటి కోతలు విధించకుండా చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు. యాభై శాతం జీతాల్లో కోతలు విధించే పరిస్తితి మన దేశంలోని మిగిలిన ఏ రాష్ట్రాలలో లేదని, కేవలం తెలుగు రాష్ట్రాలలోనే ఈ పరిస్తితి ఎందుకని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
కేవలం ఈ ఇరవై ఒక్క రోజుల లాక్ డౌన్ ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితి కుదేలు అయ్యే అవకాశమే లేదని, గతంలో కూడా ప్రపంచ ఆర్థిక మాంద్యం (1929-30) సమయంలో కూడా భారతదేశ సంప్రదాయ ఆర్థిక వ్యవస్థను పెద్దగా ప్రభావితం చేయలేదు. కేవలం జూట్ మరియు బొగ్గు పరిశ్రమల మీద మాత్రమే ప్రభావం పడింది. కాబట్టి ఇరవై ఒక్క రోజుల బ్రేక్డౌన్ కే మన ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితి లేదు. మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేంత ఎటువంటి ఇబ్బంది లేదని, అంత సులువుగా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం కూడా లేదని ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాలకు కోతలు విధించడం తగదని ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పేర్కొంటున్నారు. వైద్య సిబ్బందికి ముందుగానే నాలుగు నెలల జీతం లాక్డౌన్ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశాలో వైద్య సిబ్బందికి ముందస్తుగా నాలుగు నెలల జీతం ఇవ్వడానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ తెలుగు రాష్ట్రాలలో ఉద్యోగుల జీతాలను సగానికి తగ్గించడం సరైంది కాదని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలని ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఉద్యోగుల జీతాల సమస్యగా చూడకుండా సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలని, ప్రభుత్వమే సగం జీతం ఇస్తే ఆ ప్రభావం ప్రయివేటు ఉద్యోగులు, కార్మికుల పైనా పడుతుందని, లాక్ డౌన్ కాలంలో పూర్తి జీతాలివ్వాలని ప్రయివేటు రంగానికి, వ్యాపార సంస్థలకు విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు కోతలు విధించడం సరికాదని, ప్రభుత్వమే సగం తగ్గిస్తామంటే ప్రయివేటు సంస్థలు అదే బాటలో పయనించే ప్రమాదముందని, ప్రాణాలొడ్డి అవిశ్రాంతంగా విధులు నిర్వహిస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు సగం జీతం చెల్లిస్తే తీవ్ర నిరాశకు లోనై, అది వారందించే సేవలపై ప్రభావం చూపే ప్రమాదముందని, ఎక్కువ శాతం ఉద్యోగుల నెలజీతంపై ఆధారపడ్డారని, నిత్యావసర వస్తువులతో పాటు అందరికీ అప్పులు ఇతర అవసరాలుంటాయని కావున ఉద్యోగుల జీతాలకు కోతలు వద్దని చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ విధులు నిర్వహిస్తున్న వారికి ఒక నెల జీతాన్ని అదనంగా ఇస్తున్నారని, వందల కోట్ల రూపాయలు ఉన్న కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు, వ్యాపారులు, ధనిక వర్గానికిచ్చే రాయితీలను తగ్గించడం, అదనపు పన్ను వేయడం ద్వారా వనరులను సేకరించాలని, అంతే తప్ప నెలవారీ జీతాలపై ఆధారపడే ఉద్యోగుల పట్ల ఈ పద్ధతిలో వ్యవహరించడం విరమించాలని నిపుణులు అంటున్నారు. ఒక వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు లాక్ డౌన్ సమయంలో జీతాలకు ఎటువంటి కోతలు విధించకుండా మొత్తం జీతం చెల్లించాలని హెచ్చరికలు జారీ చేస్తూ ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తే అదే బాటలో ప్రైవేటు సంస్థలు కూడా నడుస్తాయి. అందువల్ల సగటు ఉద్యోగి జీవితం అస్తవ్యస్తమవుతుంది. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ కంపెనీలు, విమానయాన సంస్థలు, టైర్ల కంపెనీలు ఉద్యోగుల జీతాల కోతలు విధిస్తున్నారు. కరోనా వైరస్ కట్టడిలో రాత్రింబవళ్ళు ప్రభుత్వ ఉద్యోగులయిన పోలీసు అధికారులు, యంత్రాంగం, రెవెన్యూ అధికారులు, యంత్రాంగం, వైద్యులు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వంలోని ఉద్యోగులు కృషి చేస్తున్నారు. ఈ తరుణంలో వారికి బాసటగా నిలవాల్సిన ప్రభుత్వం జీతాలలో కోతలు విధించి ఆర్థిక ఇబ్బందులకు గురి చేయటం తగదు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్లకు నాలుగు నెలల జీతాన్ని అడ్వాన్స్ గా ముందుగా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నది. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందించాల్సిన ప్రభుత్వాలు అందించక పోగా జీతాల్లో కోతలు విధించడం తగదు.
- వాసిలి సురేష్
9494615360

0 Comments:
Post a Comment