💁♂️ఉద్యోగులకు సగం వేతనమే➖పెన్షన్ దారులకు కూడా కోత
*>> అత్యవసర సేవలు అందిస్తున్న శాఖలకు మినహాయింపు
విశాఖపట్నం, ఏప్రిల్ 22, (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో ఈ నెల కూడా కోత పడనున్నది. ఏప్రిల్ వేతనం కూడా సగమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ఆదాయం గణనీయంగా తగ్గిందని ఉద్యోగులకు మార్చిలో సగం వేతనమే అందజేసింది. ఇదే విధానం ఏప్రిల్ కు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు 50 శాతం వేతనాలతో గురువారం బిల్లులు సమర్పించాలని జిల్లా ఖజానా శాఖ డీడీ టి.శివరామప్రసాద్ సూచించారు.
● గత నెలలో మాదిరిగానే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, అఖిల భారత సర్వీస్ అధికారులకు 60 శాతం, పింఛన్ దారులకు 50 శాతం, నాలుగో తరగతి ఉద్యోగులకు 10 శాతం కోత పడనుంది.
● నాలుగో తరగతి రిటైర్డ్ ఉద్యోగులకు కోత లేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో రూ.15 వేల వేతనం వరకు కోత వర్తించదు. అంతకుమించితే 10 శాతం కోత ఉంటుంది.
● అత్యవసర సేవలు కింద గుర్తించిన పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, మునిసిపల్ ఉద్యోగుల (శానిటరీ వర్కర్లు మాత్రమే) వేతనాల్లో కోత ఉండదు.🙋🏻♂️

0 Comments:
Post a Comment