Know Interview schedule Interview date & information
Note: ఈ లింంకులో Registration ID లేదా Adhar number, Date of birth enter చేసి మీ Interview date తెలుసుకోవచ్చు
https://gswsvolunteer.apcfss.in/APVOLUNTEER20/apVolunteerCounsellingSchedulingStatus24042020109.vt
గ్రామ, పట్టణ వలంటీర్ల ఖాళీలకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
వాలంటీరు పోస్టుల ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. గత నియామకం తరువాత ఏర్పడ్డ ఖాళీలతో పాటు కరోనా కట్టడి చర్యల్లో సక్రమంగా పనిచేయనివారు, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారు, అకారణంగా దీర్ఘకాలిక సెలవులు పెట్టిన వారిని తప్పించి కొత్తవారిని నియమించాలని ఆదేశించింది. ఈ నెల 20 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలను ఇంటికే చేర్చేందుకు గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థను గతేడాది ఆగస్టు 15 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీరు చొప్పున నియమించింది. ఆన్‌లైన్ దరఖాస్తులు, మౌఖిక పరీక్షల ద్వారా వీరిని ఎంపిక చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా కొంత మంది వలంటీర్లు విధుల్లోకి చేరగానే ఈ పోస్టుల నుంచి వైదొలిగారు. మరికొంత మందిని అధికారులే తొలగించారు. ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను పూరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎంపిక విధానం ఇలా..!
*ప్రభుత్వ పథకాలు.. సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన ఉంటే 25 మార్కులు
*గతంలో ఎక్కడైనా పని చేసిన అనుభవం, సామాజిక, స్వచ్ఛంద సంస్థల్లో పని చేసిన వారికి 25 మార్కులు
*నాయకత్వ లక్షణాలు.. భావవ్యక్తీకరణ నైపుణ్యం ఉన్నవారికి 25 మార్కులు
*ఇతర నైపుణ్యాలుంటే 25 మార్కులు
*తహసీల్దారు, ఎంపీడీవో, ఈవోపీఆర్డీలతో కూడిన ఎంపిక కమిటీలు
*అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి అర్హులను గుర్తిస్తారని జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు.
దరఖాస్తు ఇలా.!
*వెబ్‌సైట్: https://gswsvolunteer.apcfss.in/
*స్వీకరణ: ఏప్రిల్ 20 నుంచి 24 వరకు
*పరిశీలన: 25న
*మౌఖిక పరీక్షలు: 27-29 వరకు
*నియమాక తేదీ: మే 1
*అర్హత: పదో తరగతి/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత, పని చేయాలనుకునే పంచాయతీకి చెందిన వారై ఉండాలి
*వయస్సు: 18 నుంచి 35 ఏళ్లలోపు
Download....Notification ,Imp Dates
Volunteer Registration Form.... Register Here
Download Submitted Application
Know Interview schedule Interview date & information
Note: ఈ లింంకులో Registration ID లేదా Adhar number, Date of birth enter చేసి మీ Interview date తెలుసుకోవచ్చు
https://gswsvolunteer.apcfss.in/APVOLUNTEER20/apVolunteerCounsellingSchedulingStatus24042020109.vt
0 Comments:
Post a Comment