ఏప్రిల్ 1వ తేదీ నుండి 10 ప్రభుత్వరంగ బ్యాంకులు విలీనమై నాలుగు బ్యాంకులుగా మారాయి. అలహాబాద్ బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకులు... పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, యూనియన్ బ్యాంకుల్లో విలీనమయ్యాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు...
1
ఇబ్బందులు ఉండవ్
బ్యాంకులు విలీనమైనప్పటికీ సేవలకు ఇబ్బందులు ఉండవు.
బ్యాంకు పేరు మారినప్పటికీ అకౌంట్ ఓపెనింగ్, డిపాజిట్, విత్ డ్రా, నగదు బదలీ, చెక్కు ఆమోదం, అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడం, FD, స్టేట్‌మెంట్ వంటి సేవలలో సమస్య తలెత్తదు. ఇందుకు ఆయా బ్యాంకులు అన్ని చర్యలు తీసుకున్నాయి. ఎవరైనా ఆంధ్రా బ్యాంక్ కస్టమర్ అదే పేరుతో ఉన్న తన చెక్కును సమర్పించవచ్చు. చెక్కులు, పాస్‌బుక్స్ వంటి వాటిపై ప్రకటన ఉంటుంది. అప్పటి వరకు చెల్లుతుంది.
2
బ్యాంక్ అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడీ
సమాచారం మేరకు కస్టమర్ల ప్రస్తుత అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ, డెబిట్ కార్డు, ఎంఐసీఆర్ వంటివి నోటిఫికేషన్ వరకు యథాతథంగా ఉంటాయి. మున్ముందు టెక్నికల్ కారణాలతో అకౌంట్ నెంబర్ మారితే కస్టమర్లకు తెలియజేస్తారు. ఒక ఖాతాదారుకు ఒకే కస్టమర్ ఐడీ ఉండాలి. ఏ ఐడీ కొనసాగాలనేది ఖాతాదారు ఇష్టం.
3
డెబిట్, చెక్కుల చెల్లుబాటు
విలీన ప్రక్రియ పూర్తయ్యే వరకు డెబిట్ కార్డులు, చెక్కులు చెల్లుబాటు అవుతాయి. అన్ని శాఖల్లో, ఏటీఎంలలో చెల్లుబాటవుతాయి. ఇప్పుడు ఉపయోగిస్తున్న డెబిట్ కార్డు కాలపరిమితి ముగిశాక కొత్త కార్డు జారీ చేయవచ్చు. కొత్త చెక్ బుక్స్ సమయంలో ఖాతాదారుకు సమాచారం ఇస్తారు.
4
రుణాలపై నిబంధనలు
ఏ రుణాలు తీసుకున్నా అవే వడ్డీ రేట్లు, ఈఎంఐ, కాల పరిమితి కొనసాగుతాయి. హోమ్ లేదా స్టడీ లోన్ ఇంకా ఏమైనా విడుదల కావాల్సి ఉంటే దశలవారీగా పొందుతారు. రుణాన్ని పొందే సమయంలో తీసుకున్న అసెట్ ఇన్సురెన్స్, లయబిలిటీ, ఇన్సురెన్స్ కాలపరిమితి ముగిసే వరకు ఉంటాయి. విలీనానికి ముందు జారీ చేసిన రుణాలన్నింటికి ముందటి నిబంధనలు వర్తిస్తాయి. విలీన తేదీ తర్వాత జారీ చేసే రుణాలకు మాత్రం కొత్త నిబంధనలు ఉంటాయి.
5
ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్
ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ల పైన మెచ్యురిటీ వరకు ప్రస్తుత వడ్డీ రేటు కొనసాగుతుంది. కొత్తగా చేసే డిపాజిట్లపై కొత్త నిబంధనలు వర్తిస్తాయి. FD రెన్యువల్ విషయంలో టర్మ్ డిపాజిట్ రేట్లతో పునరుద్ధరణ ఉంటుంది.

0 Comments:
Post a Comment