ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేయించాలనుకుంటున్నారా? ఆధార్ సేవలు పొందాలంటే ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సిందే. ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో ఆధార్ కేంద్రానికి వెళ్లే పరిస్థితి లేదు. కొన్ని సేవల్ని మాత్రం ఆన్‌లైన్‌లోనే పొందొచ్చు. ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌లో ఏఏ సేవలు పొందొచ్చో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని ఆధార్ సేవల విషయానికొస్తే వివరాలు అప్‌డేట్ చేయడానికి ఆధార్ సేవా కేంద్రానికే వెళ్లాల్సిన అవసరం లేదు. కామన్ సర్వీస్ సెంటర్లలో కూడా మీ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయించొచ్చు.
ఇందుకోసం కామన్ సర్వీస్ సెంటర్లకు అనుమతి ఇచ్చింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ స్పెషల్ పర్పస్ వెహికిల్‌లో భాగంగా 20,000 సెంటర్లలో ఆధార్ అప్‌డేషన్ ఫెసిలిటీ ప్రారంభం కానుంది.
ఆధార్ అప్‌డేట్ చేసే విధానం పౌరులకు మరింత సులభతరం చేసేందుకు బ్యాంకుల బ్యాంకింగ్ కరస్పాండెంట్స్‌గా నియమించిన కామన్ సర్వీస్ సెంటర్లకు యూఐడీఏఐ అనుమతి ఇచ్చింది. సుమారు 20,000 కామన్ సర్వీస్ సెంటర్లు పౌరులకు ఆధార్ అప్‌డేషన్ సేవల్ని అందించనున్నాయి.
— కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ట్వీట్
ఆధార్ అప్‌డేషన్ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేసుకునేందుకు, అనుమతులు తెచ్చుకునేందుకు కామన్ సర్వీస్ సెంటర్లకు జూన్ వరకు గడువు ఇచ్చింది యూఐడీఏఐ. గతంలో కామన్ సర్వీస్ సెంటర్లలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ప్రాసెస్ కూడా ఉండేది. కానీ ప్రైవసీ, డేటా సెక్యూరిటీపై ఆందోళనలు నెలకొనడంతో 2017 సెప్టెంబర్‌లో ఈ సేవల్ని నిలిపివేశారు. కామన్ సర్వీస్ సెంటర్లతో పాటు బ్యాంక్ బ్రాంచ్‌లు, పోస్ట్ ఆఫీసులు, యూఐడీఏఐ ఆథరైజ్డ్ సెంటర్లలో పౌరులు ఆధార్ సంబంధిత సేవలు పొందొచ్చు.
ఇక ఆధార్ కార్డు విషయానికొస్తే దాదాపు అనేక రకాల సేవలకు, ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా, పాన్ కార్డు తీసుకోవాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. అందుకే ఆధార్ కార్డులో ఏవైనా వివరాలు సరిగ్గా లేకపోతే అప్‌డేట్ చేయించాలి. ఆధార్ కార్డులో అడ్రస్ మార్చాలనుకుంటే మీరు ఆన్‌లైన్‌లో కూడా చేయొచ్చు.

0 Comments:
Post a Comment