శ్రీకాళహస్తిలో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా
అక్కడ 11 మందికి పాజిటివ్
ఈనాడు-తిరుపతి, ఈనాడు డిజిటల్-తిరుపతి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆదివారం 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఇద్దరు మందుల దుకాణం యజమానులు ఉన్నారు. మరో మహిళను దిల్లీకి వెళ్లివచ్చిన వ్యక్తి బంధువుగా గుర్తించారు. 8 మంది ఉద్యోగుల్లో ఒకరు పోలీసు అధికారి, ఇద్దరు సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూశాఖ ఉద్యోగులు ఐదుగురు ఉన్నారు. వీరంతా కొద్ది రోజులుగా రెడ్‌జోన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఐదు రోజుల క్రితం వీరినుంచీ నమూనాలు సేకరించి పరీక్షించగా ఆదివారం ఫలితాలు వచ్చాయి. పాజిటివ్ వచ్చినవారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. రెడ్‌జోన్‌కు ఆనుకుని ఉన్న మందుల దుకాణం యజమానులు ఇద్దరికి పాజిటివ్ రావడంతో ఆ దుకాణంలో ఎవరెవరు మందులు కొన్నారనే అంశంపై దృష్టిసారించారు. కరోనా సోకిన ఉద్యోగులు ఎవరెవరిని కలిశారు, ఎక్కడికి వెళ్లారనే విషయమై ఆరా తీస్తున్నారు. సుమారు 150 మందిని వీరు కలిసినట్లు ప్రాథమికంగా తేలింది. వారందరికీ సోమవారం పరీక్షలు నిర్వహించనున్నారు.

0 Comments:
Post a Comment