అమెరికాలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. అధ్యక్షుని నిర్లక్ష్యమో.. లేక కరోనా మహమ్మారి దూకుడో కానీ.. భారత కాలమానం ప్రకారం శుక్రవారం (ఏప్రిల్ 17) ఉదయం నుంచి శనివారం (ఏప్రిల్ 18) అయిదు వేల మందికి పైగా కరోనా బారిన పడి మృత్యుకుహరంలోకి చేరుకున్నారు. ఏకంగా 24 గంటల వ్యవధిలో 5 వేల మరణాలు నమోదుకావడం కలకలం రేపుతోంది. తాజా మరణాలతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 34 వేల 641కు చేరింది.
ఇక అమెరికాలో ఇప్పటి వరకూ నమోదైన వైరస్ కేసులు 6 లక్షల 78 వేల 210కు చేరుకున్నాయి. ఈ సంఖ్య వేగంగా ఏడు లక్షల మార్కును దాటే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కరోనాను ఎదుర్కొనే క్రమంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే చిన్నాభిన్నమైపోయింది.
దీన్ని గాడిలో పెట్టే క్రమంగా అధ్యక్షుడు ట్రంప్ నూతన మార్గదర్శకత్వాలను విడుదల చేశారు. వాటి అమలు అధికారాన్ని రాష్ట్రాల గవర్నర్లకు అప్పగించారు. అమెరికా అంతటా కరోనా మహమ్మారి విలయతాండం చేస్తోంది. కోవిడ్-19 వైరస్ మరణాలు, కేసుల సంఖ్య గంట గంటకూ పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
అమెరికాలో కరోనా వైరస్‌కు అతిపెద్ద హాట్ స్పాట్‌గా మారిన అమెరికా వాణిజ్య నగరం న్యూయార్క్ స్టేట్ పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకూ 2 లక్షల 26 వేల 198 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. న్యూయార్క్ దగ్గరలో వున్న న్యూజెర్సీ కోవిడ్-19 వైరస్ తీవత్రలో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 75 వేల 317 మంది వైరస్ భారిన పడగా 3 వేల 518 మంది చనిపోయారు. అమెరికాలోని మసాచుసెట్స్, మిషిగన్, కాలిఫోర్నియా, పెన్సిల్వేనియా, ఇల్లినాయిస్, ఫ్లోరిడా, లూసియానా, టెక్సస్, జార్జియా, కనెక్టికట్, వాషింగ్టన్, మేరీలాండ్ రాష్ట్రాలో కరోనా వైరస్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది.
కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన పరిస్థితిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరణాలు, కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నా, వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. దేశ వ్యాప్తంగా వైరస్ పరీక్షలను పెంచడంతో పాటు వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు ట్రంప్. అమెరికాలో కరోనా వైరస్ కారణంగా విధించిన ఆంక్షలు దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపించాయి. ఈ నేపథ్యంలో తిరిగి సాధారణ పరిస్థితులను నెలకొల్పే దిశగా ఫెడరల్ ప్రభుత్వం తాజాగా మార్గదర్శకత్వాలను జారీ చేశారు. రాష్ట్రాలు, కౌంటీలవారీగా రూపొందించిన ఈ గైడ్ లైన్స్ ను రాష్ట్రాల గవర్నర్లు పర్యవేక్షిస్తారని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తెలిపారు.
అమెరికాలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు మార్గదర్శకాలను ప్రకటించినా, ఆంక్షల సడలింపుపై గవర్నర్లు నిర్ణయం తీసుకునేందుకు అనుమతించారు అధ్యక్షుడు ట్రంప్. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ఆరోగ్యంగా ఉన్న అమెరికన్లు విధులు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు ట్రంప్. అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ఈ మార్గదర్శకాలను కాలిఫోర్నియా గవర్నర్ న్యూసోమ్ స్వాగతించారు. మరోవైపు అమెరికా సైన్యంలో కూడా కరోనా వైరస్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదు కావడం కలవరం రేపుతోంది. సైన్యంలో మూడు విభాగాల్లో దాదాపు 900 మందికి కరోనా సోకిందని తెలిపింది పెంటగాన్.
సైన్యంలో సురక్షిత వాతావరణం ఏర్పరచడంతో పాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అమెరికా అంతటా పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నారు. జాప్యాన్ని నివారించే క్రమంలో పలు ప్రాంతాల్లో డ్రైవ్ అప్ వైరస్ టెస్టులు కూడా చేపట్టారు. కరోనా మహమ్మారి బారిన పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా మాస్కుల ధరించడంతో పాటు, సోషల్ డిస్టెన్స్ కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు. కరోనా తీవ్రత నేపథ్యంలో అమెరికా అంతటా ఇప్పటికే ఆంక్షలు కొనసాగుతున్నాయి.

0 Comments:
Post a Comment