కరోనాపై జరుగుతున్న యుద్ధంలో డాక్టర్లు, మెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు ముందుండి పోరాడుతున్నారు. ఐతే ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్లు కూడా కరోనాపై జరుగుతున్న పోరాటంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. 2.60 లక్షల మంది వాలంటీర్లు ఇంటికికీ వెళ్లి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సార్లు ఇంటింటి సర్వే చేశారు. ప్రస్తుతం కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా బాధితులను తాకితే వీరు కూడా వైరస్ బారినపడే ప్రమాదముంది. ఏపీలో ఇప్పటికే పలువురు వాలంటీర్లకు సోకింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ వాలంటీర్లకు సీఎం జగన్ స్పెషల్ గిఫ్ట్ ప్రకటించారు. కరోనాపై పోరాటంతో తమ వంతు పాత్ర పోషిస్తున్న వాలంటీర్లను ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కిందకు తీసుకొచ్చారు.
ఏపీలో గ్రామ, వార్డు వాలెంటీర్లకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని వర్తింపజేసింది ఏపీ సర్కార్. ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాలతో పంచాయితీ రాజ్ శాఖకు వైద్య, ఆరోగ్య శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఈ పథకం కింద గ్రామ, వార్డు వాలంటీర్లకు రూ.50 లక్షల రూపాయల బీమా వర్తిస్తుంది. రాష్ట్రంలో ఉన్న 2,60,000 మంది గ్రామ, వార్డు వాలంటీర్లకు ఈ కరోనా బీమా వర్తించనుంది.
వాలంటీర్లకు రూ.50 లక్షల బీమా
ఏపీ వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 757 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ కోలుకొని 96 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 22 మంది చనిపోయారు. ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 639గా ఉంది. వీరందర్నీ ఐసోలేషన్ వార్డులో అన్ని సౌకర్యాలూ కల్పించి ఉంచారు. కర్నూలులో అత్యధికంగా 184 కరోనా కేసులు నమోదవగా.. గుంటూరులో 158, క్రిష్ణా జిల్లాలో 83, నెల్లూరులో 67 మంది కరోనా బారినపడ్డారు. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కరోనా ఫ్రీ జిల్లాలుగా కొనసాగుతున్నాయి.

0 Comments:
Post a Comment