ముంబయి: మే 3 తర్వాత ఏం జరగనుంది? దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను కొనసాగించే అవకాశాలైతే కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం దాని గురించి చర్చించలేదని సమాచారం. ఐతే లాక్‌డౌన్ ఎత్తేశాక షరతులు, పరిమితులతో కూడిన జీవనం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
విమానాలు, రైళ్లు మే 3 తర్వాత సేవలు ఆరంభించవని తెలుస్తోంది. కొన్ని రోజులకు నిర్దేశించిన పట్టణాల మధ్య ప్రయాణాలకే అనుమతి ఇస్తారని సమాచారం. కొన్నాళ్లు మాస్క్‌లు, వ్యక్తిగత దూరం జీవితంలో భాగం కానున్నాయి. ఇంటి నుంచి బయటకు రావాలంటే మాస్క్ ఉంటేనే అనుమతి ఇస్తారట. పెళ్లి వంటి శుభకార్యాలు, మత సమ్మేళనాలపై ఆంక్షలు కొనసాగుతాయి. నిత్యావసరాల దుకాణాలు వ్యక్తిగత దూరం పాటిస్తూ, వినియోగదారులతో పాటింపజేస్తూ అమ్మకాలు జరపొచ్చు.
కరోనా వైరస్ వ్యాప్తి పెరగకుండా ప్రభుత్వం ఇకపై దేశవ్యాప్తంగా జోన్ల వారీగా సమీక్షలు నిర్వహించనుంది. ఆంక్షల సడలింపు మొదట గ్రీన్ జోన్లకు ఉంటుంది. ఆ తర్వాత రెడ్ జోన్లలో కట్టడిని బట్టి ఆలోచిస్తారు. ముంబయి, దిల్లీ, నొయిడా, ఇండోర్‌పై మే 3 తర్వాతా దృష్టి ఎక్కువగా ఉండనుంది. ఎందుకంటే ఇక్కడ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఏదేమైనప్పటికీ మే 15 తర్వాత దేశంలో కరోనా అసలైన స్థితి తెలియనుందని సమాచారం. ఏప్రిల్ 20 నుంచి చేపట్టాల్సిన సడలింపులను చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదు.
మంగళవారం సాయంత్రానికి దేశవ్యాప్తంగా 18,970 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 601 మంది మృతిచెందారు. 15,079 మంది చికిత్స పొందుతున్నారు. 3,290 మంది కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు.

0 Comments:
Post a Comment