కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఇద్దరు అన్నదమ్ములు మానవతకు చిరునామాగా నిలిచారు. లాక్ డౌన్ కారణంగా అనేకమంది రోజువారీ కూలీలు, పేదలు కాలే కడుపులతో పస్తులు ఉండడం చూసి వారు చలించిపోయారు. తమ భూమిని అమ్మి అలా వఛ్చిన 25 లక్షలతో ఆహారసరకులు కొని వాటితో పేదల ఆకలి తీర్చుతున్నారు. తజమ్ముల్ పాషా, అతని సోదరుడు ముజమ్మిల్ పాషా.. ఇలా తమ ఇంటివద్దే ఓ టెంటు ఏర్పాటు చేసి అక్కడ ప్రతిరోజూ వారికి ఆహారం పెడుతున్నారు. తమ పేరెంట్స్ తమ చిన్నప్పుడే చనిపోయారని, దాంతో తమ బంధువు ఇంట్లో ఉంటున్నప్పుడు హిందువులు, ముస్లిములు, సిక్కులు అంతా మత భేదం లేకుండా తమ బాగోగులు చూసుకునేవారని తజమ్ముల్ పాషా భావోద్వేగంతో చెప్పాడు. అరటి తోటలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఎదిగిన వీరు..
పేదరికంలో ఉన్న బాధలేమిటో తమకు తెలుసునన్నారు. ఇప్పటివరకు మూడు వేల పేద కుటుంబాలకు అన్నం పెట్టామని ఈ అన్నదమ్ములు తెలిపారు. పైగా పేదలకు వీరు చేతి శాని టైజర్లు, మాస్కులు కూడా పంపిణీ చేస్తున్నారు.
పేదరికంలో ఉన్న బాధలేమిటో తమకు తెలుసునన్నారు. ఇప్పటివరకు మూడు వేల పేద కుటుంబాలకు అన్నం పెట్టామని ఈ అన్నదమ్ములు తెలిపారు. పైగా పేదలకు వీరు చేతి శాని టైజర్లు, మాస్కులు కూడా పంపిణీ చేస్తున్నారు.
0 Comments:
Post a Comment