భారత్‌లో 2069 కేసులు.. 53 మరణాలు
దిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ సాయంత్రం 6గంటల వరకు దేశ వ్యాప్తంగా 2069 కేసులు నమోదవ్వగా.. వారిలో 156 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మహమ్మారితో పోరాడి 53 మంది మృత్యువాత పడినట్టు తెలిపింది.
దిల్లీ: ప్రపంచాన్ని పీడిస్తోన్న కరోనా వైరస్ భారత్‌లోనూ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గురువారంనాటికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1965కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో 50మంది మరణించగా 1764మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 151మంది కొవిడ్-19 నుంచి కోలుకున్నారని తెలిపింది.
మహారాష్ట్రలో కొవిడ్-19 తీవ్రత అధికంగా ఉంది. తాజాగా ఇక్కడ మృతుల సంఖ్య 13కు చేరగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 335గా ఉంది. గుజరాత్‌లో కొవిడ్-19 మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మధ్యప్రదేశ్‌లో వైరస్ తీవ్రత పెరిగింది. మరణాల సంఖ్య ఆరుకు చేరగా 99పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పంజాబ్‌లో 46కేసులు నమోదుకాగా నలుగురు మరణించారు. కర్ణాటక, పశ్చిమబెంగాల్‌లో ముగ్గురు చొప్పున మరణించారు. దిల్లీలో కొవిడ్- 19 తీవ్రత కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 152కు చేరగా ఇద్దరు మరణించారు. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జమ్మూ కశ్మీర్‌లో కొవిడ్19 కారణంగా ఇద్దరు మరణించారు. కేరళలో కొవిడ్ తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటికే ఇక్కడ 265కి పైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇద్దరు మరణించారు. ఉత్తర్‌ప్రదేశలో లో 113కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. ఆంధ్రప్రదేశ్, బిహార్, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడులో ఒకరుచొప్పున మరణించారని ప్రభుత్వం వెల్లడించింది.
భారత్‌లో 50కి చేరిన కరోనా మరణాలు!

0 Comments:
Post a Comment