దిల్లీ: దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 12,021 కేసులు నమోదవ్వగా.. 400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మరోవైపు మొత్తం 1343 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్లు ప్రకటనలో తెలిపింది.
దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్ జిల్లాలు
దిల్లీ: దేశవ్యాప్తంగా 170 జిల్లాలను కరోనా వ్యాప్తికి హాట్‌స్పాట్లుగా గుర్తించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 207 జిల్లాలను నాన్ హాట్‌స్పాట్ జిల్లాలుగానూ, మిగిలినవి గ్రీన్‌జోన్‌లోనూ ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ సంయుక్త మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1076 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, దీంతో దేశం మొత్తంమీద కేసుల సంఖ్య 11,439కి చేరిందని తెలిపారు. ఇప్పటి వరకు 377 మంది ప్రాణాలు కోల్పోగా.. వైరస్ బారిన పడిన వారిలో 11.41 శాతం మంది కోలుకున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా కొవిడ్-19 హాట్‌స్పాట్ కేంద్రాలు, నాన్ హాట్‌స్పాట్ కేంద్రాలు, గ్రీన్‌జోన్లను గుర్తించామని లవ్ అగర్వాల్ తెలిపారు. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

0 Comments:
Post a Comment