అమరావతి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మే నెల రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ పరీక్షల కొత్త షెడ్యూల్ లాక్‌డౌన్ ఎత్తి వేసిన తర్వాత ప్రకటించనున్నారు. కరోనా వైరస్ (కోవిండ్-19) వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈ నెల 14 వరకు లాక్‌డౌన్ కొనసాగనున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేత సాధ్యమా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
0 Comments:
Post a Comment