Corona Lockdown | Coronaupdate : ప్రపంచ దేశాలకు పెద్దన్నగా, అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా... కరోనా వైరస్ కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. ఐతే... ఈ పరిస్థితి మున్ముందు మరింత తీవ్రంగా ఉంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో... 276037 పాజిటివ్ కేసులుండగా... మృతుల సంఖ్య 7385గా ఉంది. ఐతే... వచ్చే రెండు వారాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగి... 10 లక్షలు దాటే ప్రమాదం ఉంంటున్నారు నిపుణులు. ఇందుకు కొన్ని బలమైన కారణాలు చెబుతున్నారు. వాటిని పరిశీలిస్తే... నిజంగానే కేసులు పెరుగుతాయని మనకు అనిపిస్తుంది.
ఇవీ కారణాలు
- గత రెండు వారాలుగా అమెరికా ప్రజలు... ఇష్టమొచ్చినట్లు తిరిగారు.
ఇళ్లలో ఉండిపోలేదు. ప్రస్తుతం అలా తిరిగిన రాష్ట్రాల్లో ఇంకా కరోనా ఎక్కువగా ప్రబలలేదు.- వచ్చే రెండు వారాల్లో ఆ తిరిగిన రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా బయటపడే అవకాశాలున్నాయి.
- ప్రస్తుతం ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత జీరో నుంచి 5 డిగ్రీలు ఉంది.
- గత రెండు వారాలుగా తిరిగిన రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉన్నాయి. అందువల్ల అక్కడ కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది.
- ప్రస్తుతం అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది.- కోరనా వైరస్‌ను ఆపేందుకు ట్రంప్ ప్రభుత్వం బలమైన చర్యలేవీ తీసుకోవట్లేదు. ఫలితంగా కరోనా విచ్చలవిడిగా పెరుగుతోంది.
ఇలాంటి కారణాలన్నీ కలిసి... అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు 10 లక్షలు దాటుతాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే... మృతుల సంఖ్య కూడా భారీగానే పెరిగే ప్రమాదం ఉంటుంది.

0 Comments:
Post a Comment