కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో కేసులన్నీ ప్రస్తుతానికి లైవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తులు విచారిస్తున్నారు. ఇలాంటి సమయంలో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కేసు విచారణ సందర్బంగా కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో అసహనం వ్యక్తం చేసిన ఛీఫ్ జస్టిస్ ... సోమవారానికి కేసు వాయిదా వేసుకుని వెళ్లిపోయారు.
అనూహ్య పరిణామం..
నిమ్మగడ్డ కేసు విచారణలో అనూహ్య పరిణామం..
ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపు కేసు ఇవాళ మరోసారి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. ఈ కేసులో వాస్తవానికి నిన్న తీర్పు రావాల్సి ఉన్నప్పటికీ కౌంటర్ అఫిడవిట్లు ఆలస్యం కావడం, ఇతరత్రా పరిణామాలపై ఇవాళ కూడా వాదనలు జరగాల్సి ఉంది.
ఉదయం కేసు లైవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ ప్రారంభమైంది. వెంటనే సీనియర్ న్యాయవాది వెంకటరమణ వాదనలు ప్రారంభిస్తున్న సమయంలో లైవ్ లో పదుల సంఖ్యలో లాయర్లు దర్శనమిచ్చారు. వాస్తవానికి ఈ కేసు లైవ్ విచారణలో పాల్గొనేందుకు కేవలం 10 మందికి మాత్రమే అనుమతి ఉంది. కానీ కేసు విచారణపై ఉన్న ఆసక్తి కొద్దీ భారీగా జనం లైవ్ లో ప్రత్యక్షమయ్యారు.
సీజే సీరియస్...
ప్రధాన న్యాయమూర్తి అసహనం..
కీలక మైన కేసు విచారణకు సంబంధించిన లైవ్ లో ఇంత మంది పాల్గొనడం ప్రధాన న్యాయమూర్తికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వీడియో కాన్ఫరెన్స్ విచారణలో అనుమతించినవారు కాకుండా ఇతర న్యాయవాదులు ప్రవేశించడంపై ధర్మాసనం సీరియస్ అయ్యింది. కేవలం 10 మందికి పాస్ వర్డ్ ఇస్తే, ఒకేసారి 40 మంది వీడియో కాన్ఫరెన్స్ లోకి ఎలా వచ్చారన్న సీజే ప్రశ్నించారు. పాస్‍వర్డ్ లీక్ చేయడం వల్లే ఇలా జరుగుతుందని సీజే ఆగ్రహం వ్యక్తం చేసారు. పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు జరుగుతుండగానే క్రాస్‍టాక్ రావడం పట్ల సీజే అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇక నేరుగా..
లైవ్ విచారణ వాయిదా.. ఇక నేరుగా..
హైకోర్టు విచారణ సందర్భంగా చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో ఖిన్నుడైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి... నిమ్మగడ్డ రమేశ్‍కుమార్ పిటిషన్‍పై విచారణ సోమవారానికి వాయిదా వేశారు. అంతే కాకుండా ఈ కేసును ప్రత్యేకంగా తీసుకుని, నేరుగా కోర్టులోనే విచారణ చేస్తామని, సీజే చెప్పారు. కోర్టుతో సంబంధమున్న న్యాయవాదులకు మాత్రమే పాసులు జారీ చేసేలా డీజీపీకి ఆదేశాలు ఇస్తామని చెప్పారు. కొంత మంది న్యాయవాదులు హైదరాబాద్ నుంచి రావాల్సి ఉండటంతో, సీజే దీనికి సంబంధించి డీజీపీకి లేఖ రాస్తాం అని చెప్పారు. సోమవారం అందరూ సమాజీక దూరం పాటిస్తూ, నిబంధనులు పాటిస్తూ, కోర్ట్ కు హాజరు కావాలని చెప్పారు.
కోడ్ లీక్ పై విచారణ..
పాస్ వర్డ్ లీక్ పై విచారణ..
సాక్ష్యాత్తూ ఛీఫ్ జస్టిస్ పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ పాస్‍వర్డ్ లీక్ ఎలా అయ్యింది, ఎవరు ఆ వీడియో కాన్ఫరెన్స్ లోకి వచ్చారు అనే అంశంపై ఇప్పుడు హైకోర్టు రిజిస్ట్రీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఛీఫ్ జస్టిస్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు టెక్నికల్ టీమ్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
బాధ్యులెవరో తేల్చాక ఈ అంశాన్ని తిరిగి ఛీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
Also Read....
YSR PENSION STATUS CHECK
Ration Card status check
🔎YSR Arogyasri card Status
New.... Google Android Apps
CCE SUMMATIVE & FORMATIVE MODEL QUESTION PAPERS

0 Comments:
Post a Comment