హెచ్-1బి వీసాదారులపై వేలాడుతున్న కత్తి
జూన్‌లోగా 2 లక్షల మంది చట్టబద్ధ హోదా కోల్పోయే ముప్పు
వాషింగ్టన్: కరోనా దెబ్బకు అమెరికాలో పలు కంపెనీలు తాత్కాలికంగా మూతపడటంతో ఇబ్బంది పడుతున్న విదేశీ నిపుణులకు మరో ఉపద్రవం పొంచి ఉంది. ఈ ఏడాది జూన్ చివరిలోగా రెండు లక్షల మందికిపైగా ఉద్యోగులు చట్టబద్ధమైన హోదాను కోల్పోయే ముప్పుంది. ఇమ్మిగ్రేషన్ వ్యవహారాల నిపుణుల విశ్లేషణ ప్రకారం.. అమెరికాలో గ్రీన్‌కార్డు పొందేందుకు ప్రయత్నిస్తున్న విదేశీ నిపుణుల సంఖ్య ప్రస్తుతం దాదాపు దాదాపు 2.5 లక్షలుగా ఉంది. వారిలో హెచ్-1బి వీసాదారులే రెండు లక్షల మంది వరకు ఉంటారు.
కరోనా సంక్షోభంతో అమెరికాలో చాలా కంపెనీలు మూతపడ్డాయి. లక్షల మంది అమెరికన్లు ఉపాధి కోల్పోయారు. అధిక సంఖ్యలో హెచ్-1బి వీసాదారులకూ ఇదే పరిస్థితి ఎదురైంది. నిబంధనల ప్రకారం.. హెచ్-1బి వీసాదారులు వేతనాలు పొందకుండా అమెరికాలో ఎక్కువ రోజులు ఉండకూడదు. ఉన్న ఉద్యోగాన్ని కోల్పోతే.. 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. లేదా వేరే వీసా విభాగంలోకి మారాలి. ఇవేవీ చేయలేకపోతే స్వదేశాలకు తిరుగు ప్రయాణమవ్వాలి. ఈ నేపథ్యంలో 2 లక్షల మంది హెచ్-1బి వీసాదారులు, వారి కుటుంబ సభ్యులపై చట్టబద్ధ హోదా కత్తి వేలాడుతోందని అంచనా.
వీసా గడువును ఉచితంగా పొడిగించిన బ్రిటన్
బ్రిటన్‌లోని భారతీయ ఆరోగ్యరంగ నిపుణులకు ఊరట. కరోనాపై పోరులో తమ దేశానికి సేవలందిస్తున్న ఆరోగ్యరంగ సిబ్బంది వీసాల గడువును ఏడాదిపాటు ఉచితంగా పొడిగిస్తున్నట్లు బ్రిటన్ హోంమంత్రి ప్రీతీ పటేల్ ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబరు 1లోగా వీసా గడువు ముగియనున్న విదేశీ ఫార్మసిస్టులు, రేడియోగ్రాఫర్లు సహా ఆరోగ్యరంగ సిబ్బంది మొత్తానికి ఈ పొడిగింపు వర్తిస్తుందని స్పష్టం చేశారు.

0 Comments:
Post a Comment