Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Tuesday, 3 March 2020

School Assembly Dt.3/3/2020

School Assembly Dt.3/3/2020

*🔥 TODAY'S NEWS 03.02.2020🔥*


1.China repeated call for dialogue after North Korea missile launch

2.Over 160 rape cases were reported on railway premises, on board trains from 2017-2019

3.The death toll has risen to 43 in Delhi following clashes over citizenship law

4.Convicts in the Nirbhaya rape and murder case will not be hanged tomorrow.

5.Dhoni got heroes welcome in Chennai ahead of IPL 2020

6.UNESCO team will visit Indore on Rangpanchami

7.Dr Anand received Banjara Ratna Award

8.Work For Construction of Rama Temple began in Ayodhya

9.)2 positive cases of coronavirus detected in Delhi and Telangana,

10)New Zealand defeat India in Christchurch to sweep Test series

*🥀THOUGHT OF THE DAY☀*

*Be a child to enjoy what you have*

*☀TODAY GK☀*

*Q: *What's the smallest district in Telangana?*

A: *Mulugu*


🙏పాఠశాల అసెంబ్లీ కోసం🙏
--03.03.2020--
🔍నేటి ముఖ్యమైన వార్తలు🔎


*1. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.*

*2..ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ (కొవిడ్-19) హైదరాబాదను తాకింది.నగరంలో తొలి కేసు నమోదైంది.*

*3.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకున్నఅన్ని సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు.*

*4.పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం వాడివేడిగా ప్రారంభమయ్యాయి.*

*5.శ్రీలంక పార్లమెంట్ ను రద్దు చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్సే ప్రకటించారు.*

*6.విస్తరిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా  2009 ఆర్థిక సంక్షోభం నాటి కంటే తీవ్ర స్థాయికి చేరొచ్చని ది ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఒఇసిడి) విశ్లేషించింది.*

*7.. మహిళల టీ-20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ కు చేరుకుంది.*

*👉నేటి సూక్తి.*

*తనకు నచ్చిన పనిని ప్రతివాడు చేస్తాడు. కానీ చేస్తున్న పనిని ఇష్టపడేవాడికే నిజమైన సంతోషం లభిస్తుంది.*

*🔆మంచి పద్యం🔆*

*తన కోపమె తన శత్రువు*
*తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ*
*తన సంతోషమె స్వర్గము*
*తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!*

*👉తాత్పర్యం: ఓ సుమతీ! ఎవరికైనా తన కోపమే తన శత్రువగును. తన శాంతమే తనకు రక్షగా నిలుచును. తను చూపెడి దయాగుణమే బంధువులవలె సహకరించును. తాను సంతోషముగా ఉండగలిగినచో అది స్వర్గంతో సమానం. తాను దుఃఖమును చేతులారా తెచ్చుకొనినచో అదియే నరకమగుట తథ్యం అని భావం.*

*♦నేటి ప్రశ్న♦*

*Q. దేశంలో అత్యధిక శాతం ముస్లిం జ‌న‌భా ఉన్న రాష్ట్రం ఏది?*

*A: అసోం*


🌎 *చరిత్రలో ఈ రోజు*

👉 *03 మార్చి, 2020*
👉 *మంగళవారం*
👉 *సంవత్సరములో 63వ రోజు 9వ వారం*
👉 *సంవత్సరాంతమునకు ఇంకా 303 రోజులు మిగిలినవి (ఇది లీపు సంవత్సరము)*
〰〰〰〰〰〰〰〰
🔴 *ప్రత్యేక  దినాలు*
🚩 *ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం*
[వన్యప్రాణి అంటే మానవుడు మచ్చిక చేసుకోని జంతువులను వన్య ప్రాణులుగా అభివర్ణిస్తారు. వన్యప్రాణులసంరక్షణ రెండు దశలలో చేస్తారు. మొదటిది భూమిపైన గల భౌతిక పరిసరాలను, మొక్కల సమాజాన్ని కాపాడటం, రెండవది జన్యువు వైవిధ్యం జాగ్రత్తపరచడానికి అన్ని జాతుల మొక్కలను, జంతువులను కాపాడుట. అనేక దేశాల వారు వన్యప్రాణుల ప్రాముఖ్యతను తెలియచేయడానికి వన్యప్రాణులను జాతీయ జంతువులుగా గుర్తించారు. ]

🚩 *జాతీయ రక్షణ దినోత్సవం*
[దేశరక్షణకు మీరే కీలకం. జాతియావత్తూ చేస్తుంది మీకు సలాం. జాతీయ రక్షణ దినోత్సవం సందర్భంగా సైనికులకు శుభాకాంక్షలు. అమరజవాన్లకు జన నీరాజనాలు.]
〰〰〰〰〰〰〰〰
🏀 *సంఘటనలు*
✴1938: సౌదీ అరేబియాలో పెట్రోల్ గుర్తింపు.

✴1939: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ముంబైలో నిరాహార దీక్ష.

✴1967 : నక్సల్బరీ ఉద్యమం మొదలైంది.

✴1991: విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన్ కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము. కళాభారతి ఆడిటోరియము 1991 మే 11 లో, విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ప్రారంభించారు.

✴2008: రష్యా అధ్యక్ష ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు పుతిన్ బలపర్చిన అభ్యర్థి దిమిత్రి మెద్వెదేవ్ విజయం.

✴2009: పాకిస్తాన్లో లాహోర్ లోని గఢాఫి స్టేడియం సమీపంలో శ్రీలంక క్రికెట్ క్రీడాకారులపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు.
〰〰〰〰〰〰〰〰
🌐 *జననాలు*
❇1847: *అలెగ్జాండర్ గ్రహంబెల్,*  టెలీఫోనును కనిపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త. (మ.1922)

❇1880: *ఆచంట లక్ష్మీపతి,*  ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు, సంఘసేవకుడు. (మ.1962)

❇1891: *కొంగర సీతారామయ్య,*  ప్రముఖ రంగస్థల నటుడు,కవులకు, గాయకులకు, పండితులకు, మిత్రులకు ఎనలేని దానాలు చేశాడు. (మ.1978)

❇1895: *రాగ్నర్ ఫ్రిష్,*  ప్రముఖ ఆర్థికవేత్త . (మ.1973)

❇1937: *సత్యం శంకరమంచి,*  పాఠకుణ్ణి ఏకబిగిగా చదివించే గుణం సత్యం కథలలో ఉంది.అమరావతి కథలు గ్రంథానికి 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ పొందారు.

❇1939: *ఎం.ఎల్.జయసింహ,* హైదరాబాదుకు చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.

❇1955: *జస్పాల్ భట్టి,*  ప్రముఖ హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (మ.2012)

❇1967: *శంకర్ మహదేవన్,*  ప్రముఖ భారతీయ గాయకుడు, స్వరకర్త.

❇1982: *జెస్సికా బీల్,*  అమెరికా నటీమణి, పూర్వపు మోడల్.

❇1989: *కృష్ణ దేశగాని,*  ప్రముఖ రచయిత, సంఘసేవకుడి జననం

❇1839: టాటా గ్రూప్ వ్యవస్థాపకులు *జంషెడ్జీ టాటా* జననం.
〰〰〰〰〰〰〰〰
⚫ *మరణాలు*
◾1943: *శ్రీపాద కామేశ్వరరావు,*  సుప్రసిద్ధ రంగస్థల నటుడు,మరాఠీ, ఒరియా, తమిళ, ఫ్రెంచి, పంజాబీ నాటకలాల్ను ఆంధ్రావళికి అనువదించి అందించారు.

◾1993: అమెరికాకు చెందిన ఓరల్ పోలియో వాక్సిన్ సృష్టికర్త  *అల్బెర్ట్ సాబిన్*

◾2002:  *జి.ఎం.సి.బాలయోగి,*  ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (జ.1951)

◾2008: వాహినీ సంస్థ వారి దేవత, సుమంగళి వంటి చిత్రాలలో నటించిన నటీమణి *కుమారి.*  🙏🏻

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top