Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Thursday, 5 March 2020

School Assembly 5/3/2౦2౦

School Assembly 5/3/2౦2౦

🙏పాఠశాల అసెంబ్లీ కోసం🙏

*---05.03.2020--

🔍నేటి ముఖ్యమైన వార్తలు🔎*

*1. తెలంగాణ రాష్ట్రంలోని ఒక్క వ్యక్తికి కూడా కరోనా వైరస్‌ సోకలేదని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.*

*2.కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, రాష్ట్ర ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని) రాష్ట్ర ప్రజలకు సూచించారు.*

*3.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతనంగా రూపొందించిన జియో ఇమేజింగ్‌ శాటిలైట్‌ (జీఐ శాట్‌–1) ప్రయోగం వాయిదా పడింది.*

*4.ఉత్తరాఖండ్‌ వేసవి రాజధానిగా గైర్సైన్‌ను ఎంపిక చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తివేంద్ర సింగ్‌ రావత్‌ ప్రకటించారు.*

*5.దేశంలోకి ప్రవేశించి వేగంగా విస్తరిస్తున్న కోవిడ్‌-19ను కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీగా ప్రకటించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు.*

*6.కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా అజయ్‌ భూషణ్‌ పాండే నియమితులయ్యారు.*

*7.ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న గాలి కాలుష్యం వలన ప్రపంచ వ్యాప్తంగా ఏటా 88 లక్షలమంది వరకు  చనిపోతున్నారు. ఇందులో ఇండియన్లే 18 లక్షల మంది వరకు ఉన్నారు.*

*8.బీసీసీఐ నూతన సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ జోషీ నియమితులయ్యారు.*

*9. ఒలింపిక్స్‌కు యథావిథిగా సిద్ధం కండి ...క్రీడాకారులందరూ ఒలింపిక్స్ కోసం మరింత ఉత్సాహంగా తమ ట్రైనింగ్ కొనసాగించాలని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిండెంట్ థామస్ బాఖ్ కోరారు.*

*👉నేటి సూక్తి.*

*చిన్న పని కదా అని అలక్ష్యం చేయకండి. చిన్న విత్తనం నుండే మహావృక్షం ఉద్భవిస్తుందని మరువకండి.*

*🔆మంచి పద్యం🔆*

*ఎప్పుడు సంపద కలిగిన*
*నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్*
*దెప్పలుగఁజెఱువు నిండినఁ*
*గప్పలు పదివేలుఁజేరుఁగదరా సుమతీ!*

*👉తాత్పర్యం: మనకు ఎప్పుడైతే సంపదలు చేకూరునో, అప్పుడు బంధువులు అధికంగా వచ్చుదురు. ఎలాగనగా చెరువు నిండా నీరు చేరి అలలు వచ్చునట్టి సమయమున వేల కొలది కప్పలు వచ్చి చేరినట్లు అని భావం.*

*♦నేటి ప్రశ్న♦*

*Q. నాణేల గురించి అధ్యయ‌నం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?*

*A: ముద్రా శాస్త్రం*


🌎 చరిత్రలో ఈ రోజు

👉 *05 మార్చి, 2020*
👉 *గురువారం*
👉 *సంవత్సరములో 65వ రోజు 10వ వారం*
👉 *సంవత్సరాంతమునకు ఇంకా 301 రోజులు మిగిలినవి (ఇది లీపు సంవత్సరము)*
〰〰〰〰〰〰〰〰
🔴 *ప్రత్యేక  దినాలు*
🚩 *అస్సాం రైఫిల్స్ రైటింగ్ దినోత్సవం.*
〰〰〰〰〰〰〰〰
🏀 *సంఘటనలు*
✴2010: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
✴1824: బర్మా పై బ్రిటన్ యుద్ధం ప్రకటన.
✴1931:  రాజకీయ ఖైదీ ల విడుదల ఒపందంపై గాంధీ- ఇర్విన్ ఒడంబడిక కుదిరింది. బ్రిటిష్ ప్రతినిధులు, మహాత్మా గాంధీ సంతకం.
〰〰〰〰〰〰〰〰
🌐 *జననాలు*
❇1901: కల్యాణం (ఈలపాట) రఘురామయ్య, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. (మ.1975)
రఘురామయ్యగారు నోటిలో వ్రేలు పెట్టి ఈల వేస్తూ పద్యాలను, పాటలను పాడేవారు. ఇందుమూలముగా ఈయన "ఈలపాట రఘురామయ్య"గా పేరు ఉండేది.
❇1913: కిరాణా ఘరానాకు చెందిన హిందుస్థానీ సంగీత విద్వాంసురాలు గంగూబాయి హనగల్ జననం (మ.2009).
❇1917: కాంచనమాల, అలనాటి అందాల నటి. (మ.1981)
❇1918: జేమ్స్ టోబిన్, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత .
❇1920: మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, తెలుగు సాహిత్యంలో కవి. తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా అచ్చ తెలుఁగు సాహిత్యంలో పేరెన్నికగన్న కవులలో ప్రముఖుడు. ఆంధ్ర కల్హణ, కళా ప్రపూర్ణ బిరుదాంకితుడు. (మ. 1992)
❇1924: గణపతిరాజు అచ్యుతరామరాజు, వాది, సాహిత్య, సాంస్కృతిక, నాటక కళాకారులు. (మ.2004)
❇1928 : ఆల్కే పదంసీ, పలు ప్రతిష్ఠాత్మక అడ్వర్‌టైజ్‌మెంట్లకు సృష్టికర్త.
❇1937: నెమలికంటి తారకరామారావు, శ్రీకళానికేతన్ సంస్థను స్థాపించి, ఆ సంస్థ తరపున 30 నాటక, నాటికలను హైదరాబాదు లోనూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోనూ ప్రదర్శింపజేశారు.
❇1958: నాజర్, దక్షిణాదికి చెందిన ఒక సుప్రసిద్ధ నటుడు.
❇1984: ఆర్తీ అగర్వాల్, తెలుగు సినిమా నటీమణి. (మ.2015)
❇1987 : రష్యా దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి అన్నా చక్వతడ్జే జననం.
మరణాలు
◾1827: అలెస్సాండ్రో వోల్టా, బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త. (జ.1745)
◾1827: పియర్ సైమన్ లాప్లేస్ ప్రముఖ ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రజ్ఞుడు (జ.1749)
◾1945: గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, గొప్ప కవి, శతావధాని.
◾1953 : రష్యా నేత సోవియట్ యూనియన్‌కు బ్యూరోక్రాటిక్ పాలకుడు జోసెఫ్ స్టాలిన్ మరణం (జ.1878).
◾1996: పిఠాపురం నాగేశ్వరరావు, ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు.
◾2004: కొంగర (కంచు కంఠం ) జగ్గయ్య, ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. (జ.1928)
◾2013: రాజసులోచన, తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరతనాట్య నర్తకి. (జ.1935)
◾2017: సి.వి.సుబ్బన్న ప్రముఖ శతావధాని (జ.1929)  

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top