రూ1.70లక్షల కోట్ల ప్యాకేజీ:నిర్మలా సీతారామన్
దిల్లీ: కరోనా వైరస్ దృష్ట్యా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన వేళ కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా గరీబ్ కల్యాణ్ స్కీమ్ పేరుతో రూ.1.70లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. గురువారం ఆమె దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వలస కార్మికులు, పట్టణ, గ్రామీణ పేదలను ఆదుకునేలా ప్యాకేజీ రూపొందించినట్లు చెప్పారు. పేద కార్మికులను ఆదుకోవడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టామని వివరించారు. శానిటేషన్ వర్కర్లు, ఆశా, పారామెడికల్, వైద్యులు, నర్సులకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున ప్రత్యేక బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
‘‘ఈ ప్యాకేజీని రెండు విధాలుగా అందిస్తాం. ఈ పథకం ద్వారా రానున్న మూడు నెలలకు ఒక్కొక్కరికి నెలకు రూ.5కేజీల బియ్యం పంపిణీ, పేదవాళ్లలో ఒక్కరు కూడా ఆహారం లేకుండా ఉండే పరిస్థితి రానీయం. కుటుంబానికి కిలో చొప్పున పప్పులు అందిస్తాం. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా సాయం చేస్తాం. స్వయం సహాయక బృందాలకు రుణపరిమితి రూ.10లక్షలకు పెంపు. ఎలాంటి పూచీకత్తు లేని రుణాలు అందజేస్తాం. దీనిద్వారా 63 లక్షల స్వయం సహాయక బృందాలకు లబ్ధి. దేశ వ్యాప్తంగా 20 కోట్ల మంది మహిళలకు మేలు జరుగుతుంది. ఉపాధిహమీ వేతనాలు రూ.182 నుంచి రూ.202కు పెంపు. ఉజ్వల పథకం కింద లñబ్ధిదారులకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. రూ.15వేల లోపు జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందా కేంద్రమే భరిస్తుంది. ఉద్యోగి వాటా, యజమాని వాటాను కలిపి ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేస్తుంది. వంద మందిలోపు ఉద్యోగులు ఉన్న సంస్థలకు మాత్రమే ఇది వర్తిస్తుంది’’ అని ఆర్థిక మంత్రి వివరించారు.

0 Comments:
Post a Comment