మీ డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిందా? రిజిస్ట్రేషన్ ఎక్స్‌పైరీ అయిందా? రెన్యువల్ చేసే వరకు మీ వాహనాన్ని బయటకు తీసే పరిస్థితి లేదని ఆందోళనగా ఉన్నారా? కేంద్రం శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన సంక్షోభం కారణంగా వాహనదారులకు ఊరట కల్పించింది కేంద్రం. ఫిబ్రవరి 1 తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్స్, రిజిస్ట్రేషన్ గడువు మిగిసినా ఆ వాహనాలు వస్తు రవాణా కోసం తిరగొచ్చని కేంద్రం తేల్చి చెప్పింది. వాటి గడువును జూన్ 30 వరకు పొడిగించింది. అంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ గడువు ఫిబ్రవరి 1 తర్వాత ఎప్పుడు ముగిసినా వేలిడిటీ జూన్ 30 వరకు ఉన్నట్టే. కరోనా వైరస్ లాక్‌డౌన్ ముగిసిన తర్వాత మీరు రెన్యువల్ చేయొచ్చు.
డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్స్, రిజిస్ట్రేషన్ గడువును జూన్ 30 వరకు పొడిగించినట్టు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అడ్వైజరీ జారీ చేసింది కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ. మోటార్ వెహికిల్స్ యాక్ట్, సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌కు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఫిబ్రవరి 1 తర్వాత గడువు ముగిసిన ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌తో పాటు సంబంధిత డాక్యుమెంట్స్‌ని అనుమతించాలని కేంద్రం కోరింది. నిత్యావసర వస్తువులు, ఇతర ముఖ్యమైన ఉత్పత్తుల రవాణాలో ఇబ్బందులు తలెత్తకూడదని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

0 Comments:
Post a Comment