కరోనా వైరస్ ఓ కుటుంబంలో చిచ్చుపెట్టింది. అదేంటి అనుకుంటున్నారా.. అవును మీరు చదివింది నిజమే. కరోనా వైరస్‌పై ఏమాత్రం అవగాహన లేని ఓ వ్యక్తి.. వీళ్లు.. వాళ్లు చెప్పిన మాటలు విని కొడుకుకు కరోనా సోకిందని భార్యను కొట్టి తల్లీకొడుకులను బయటికి తరిమేశాడు. ఈ హృదయ విదారక ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చింతూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సుకుమామిడి(కొండరెడ్ల)లో బుధవారం జరిగింది. సుకుమామిడికి చెందిన కుండ్ల రాజారెడ్డి, లక్ష్మి దంపతులకు ఎనిమిదేండ్ల కొడుకు సంజీవరెడ్డి ఉన్నాడు.
మూడో తరగతి చదువుతున్న సంజీవరెడ్డి గత నాలుగు రోజులుగా టైఫాయిడ్ జ్వరంతో చికిత్స పొందుతున్నాడు.
దీన్ని తండ్రి రాజారెడ్డి తన కుమారుడికి కరోనా వ్యాధి సోకిందనకున్నాడు. దీంతో కుమారుడిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోవాలంటూ భార్యను కొట్టి బయటకు తరిమేశాడు. భార్య లక్ష్మి ఏం చేయాలో తెలియక మోతుగూడెం పోలీసులను సంప్రదించింది.
వెంటనే స్పందించిన ఎస్ఐ మోతుగూడెం పంచాయతీ కార్యదర్శి రంగమ్మతో తులసిపాక పీహెచ్‌సీకి తరలిచారు. అక్కడ వైద్యుడు కోటేశ్వరరావు సంజీవరెడ్డికి ఏలాంటి కరోనా అనుమానిత లక్షణాలు లేవని, కేవలం జ్వరంతో ఇబ్బందిపడుతున్నాడని, చికిత్స అందించి ఇంటికి పంపారు. కార్యదర్శి రంగమ్మ వారిని ఇంటికి తీసుకెళ్లి భర్త రాజారెడ్డికి కరోనాపై కౌన్సిలింగ్ చేసి అప్పగించారు

0 Comments:
Post a Comment