Corona Lockdown | Coronaupdate : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి... మనం మరింత అలర్ట్‌గా ఉండాలి. మనుషులకు వీలైనంత దూరం జరగాలి. ఐతే... లాక్‌డౌన్ ప్రకటించాక... ఇది మొదటి ఒకటో తారీకు కాబట్టి... ఓ వారం పాటూ కొన్ని ప్రదేశాలకు మనం వీలైనంతవరకూ దూరంగా ఉండాలి. వాటిలో మొదటిది ఏటీఎం. జీతాలు వస్తాయి కాబట్టి... చాలా మంది మనీ విత్ డ్రా చేసుకోవడానికి ఏటీఎం కేంద్రాలకు వెళ్తారు. అక్కడ సోషల్ డిస్టాన్స్ పాటిస్తే కొంత పర్వాలేదు. పాటించకపోతే ప్రమాదమే. ఏటీఎం యంత్రం దగ్గర కూడా బటన్స్‌ని అందరూ టచ్ చేస్తారు కాబట్టి... ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా చేతులకు హ్యాండ్ శానిటైజర్ వాడి తీరాల్సిందే. లేదంటే కరోనా కాటు తప్పదంటున్నారు.
బ్యాంకులు తగినంత స్థాయిలో నగదు నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు సూచించారు. నేడు వివిధ వర్గాలకు చెందిన ప్రజల ఖాతాల్లోకి కేంద్రం నగదు బదిలీ చేయనుంది. ఆయా వర్గాలు విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా బ్యాంకుల శాఖల్ని తెరచి ఉంచాలని కోరింది.
ఏటీఎంలే కాదు... సూపర్ మార్కెట్లు, షాపుల దగ్గర ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడే ప్రమాదం ఉంది. రోజూ తీసే షాపులే కదా... ఎందుకు గుమికూడుతారు అంటే... ఇందుకు మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటోది... ఏప్రిల్ 14 వరకూ లాక్‌డౌన్ ఉంటుంది. అందుకు సరిపడా సరుకులు సిద్ధం చేసుకోవాలి. రెండోది ప్రజల దగ్గర ఇవాళ్టి నుంచి మనీ ఉంటుంది. (పేదల దగ్గర మాత్రం ఉండదు. అది విచారకరం). తమ దగ్గర ఉన్న డబ్బుతో ప్రజలు సామాన్లు కొనుక్కుంటారు. మూడోది... ప్యానిక్ బైయింగ్. ఇది ప్రపంచం మొత్తం ఉంది. మున్ముందు సామాన్లు దొరకవేమోనని అవసరమైన వాటి కంటే ఎక్కువగా కొనుక్కుంటున్నారు చాలా మంది. మన ఇండియాలో ఇది కాస్త తక్కువే... అదే విదేశాల్లోనైతే... సూపర్ మార్కెట్లలో సామాన్లు మొత్తం ఖాళీ అయిపోయాయి. అంతలా ప్యానిక్ బైయింగ్ అక్కడ ఉంది.
ఇప్పుడీ 14 రోజులూ మనం జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున కరోనా సోకినా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇప్పుడున్న మందుల్లో దాదాపు 69 మందులు దాన్ని కంట్రోల్ చెయ్యగలుగుతున్నాయి. వాటిలో ముఖ్యంగా హైట్రాక్సీ క్లోరోక్విన్ ఎక్కువ మంది వాడుతున్నారు. అయినప్పటికీ... ఈ సోకడాలు, మిగతావాళ్లకు అంటుకోవడాలూ లాంటి తలనొప్పులు రాకుండా ఉండాలంటే... మనం సమూహాలకు దూరంగా ఉండాల్సిందే. సామాన్ల కొరతైతే ఉండదని ప్రభుత్వాలు చెబుతున్నాయి కాబట్టి... టెన్షన్ అవసరం లేదు.

0 Comments:
Post a Comment