Corona Tests : ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్పతులకే పరిమితమైన కరోనా పరీక్షల అనుమతులను ఇప్పుడు ప్రైవేట్ ల్యాబ్‌లకు కూడా ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) అనుమతులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 35 మెడికల్ ల్యాబ్‌లకు అనుమతులు ఇచ్చింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న తొమ్మిది రాష్ట్రాల్లోని ప్రైవేట్ ల్యాబ్‌లకు పరీక్షలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణలోని 5 ల్యాబ్‌లకు అనుమతి లభించింది. ఏపీలోని ఏ ఆస్పత్రికి కూడా అనుమతి దక్కలేదు. తెలంగాణలో ఉన్న ఆస్పత్రుల్లో అన్నీ హైదరాబాద్‌కు చెందినవే. అందులో జూబ్లీహిల్స్ అపోలో, హిమాయత్ నగర్‌లోని విజయ డయాగ్నస్టిక్స్, ఐడీఏ చర్లపల్లిలోని విమతా ల్యాబ్స్, సికింద్రాబాద్ అపోలో, పంజాగుట్టలోని డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్ ఉన్నాయి.

0 Comments:
Post a Comment