తేది:31/3/2020
ప్రజాపాలన దినపత్రికలో నేను రాసిన ఆర్టికల్
"కరోనా సర్వే ఉపాధ్యాయుల్లో భయాందోళనలు"
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు, వాటిపై ఇంటింటికీ తిరిగి పట్టణ, నగర ప్రాంత ప్రజల్లో సర్వే చేసి పూర్తి స్థాయిలో డేటా సేకరించడానికి రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉపయోగించాలని ప్రభుత్వం యోచన చేస్తోంది. దీనిపై ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపింది. ఈ సర్వే విధులను ఉపాధ్యాయులకు తప్పనిసరి చేయవద్దని, స్వచ్చందంగా పాల్గొనే వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. యాభై ఏళ్ళు లోపు వారికే డ్యూటీలు కేటాయిస్తామని, ఉపాధ్యాయులు నివాసం ఉన్నచోటే డ్యూటీ అవకాశం ఇస్తామని, అనారోగ్యం కలిగిన వారు మరియు దివ్యాంగులకు ప్రత్యేక మహిళలకు, గర్భిణీ స్త్రీలకు, ఫీడింగ్ మదర్లకు మినహాయింపులు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. మహిళ టీచర్ల విషయంలో ప్రభుత్వం నుండి మినహాయింపు విషయంపై ప్రభుత్వం స్పష్టత రాలేదు.
ఇప్పటికే ప్రధానోపాధ్యాయులు, వార్డు సెక్రటరీ సహయంతో పిల్లలకు ఇంటికి వెళ్ళి మధ్యాహ్న భోజన పథకం సరుకులు ఇవ్వటంలో నిమగ్నమై ఉన్నారు. రాష్ట్రంలోని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు అందరూ ఆంగ్ల భాషకు సంబంధించిన ఆన్లైన్ కోర్సులు, డైలీ పరీక్షలు వ్రాయాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. చాలా మంది ఉపాధ్యాయులు ఈ ఆన్లైన్ కోర్సులలో నిమగ్నమై డైలీ పరీక్షలు వ్రాస్తున్నారు. కరోనా సర్వే ప్రస్తుతానికి మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో మాత్రమే చేయాలని భావిస్తున్నా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే చేపట్టే అవకాశం లేకపోలేదు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులను ఎన్నికలు, జనాభా గణన, ప్రకృతి వైపరీత్యాలలో ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే చాలా జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాయామవిద్య ఉపాధ్యాయులయిన పిఈటి, ఫిజికల్ డైరెక్టర్లకు కరోనా కట్టడి భద్రతా చర్యలలో భాగంగా పోలీసింగ్ విధులు కేటాయించారు. అదేవిధంగా సైన్సు ఉపాధ్యాయులకు కొన్ని చోట్ల పారిశుధ్యంపై అవగాహన కల్పించే విధులు కేటాయించి ఉన్నారు. అంతేకాకుండా 'నాడు నేడు' కార్యక్రమాలు జరుగుతున్న స్కూళ్ళలో ఈ మౌలికవసతుల కల్పన నిర్మాణ పనులు జరపాలని ఉత్తర్వులు జారీచేసి ఉన్నారు, కానీ నిర్మాణ, మరమ్మత్తులు పనులు చేపట్టడం ఉపాధ్యాయుల ఒక్కరి వల్ల జరిగే పని కాదు. ప్రస్తుతం లాక్ డౌన్ జరుగుతున్న కారణంగా నాడు నేడు పనులు సాధ్యం కావని ప్రస్తుతానికి వీటి నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
కరోనా సర్వే, కరోనాకు సంబంధించిన అత్యవసర విధుల్లో ఉపాధ్యాయులను వినియోగించుకోవడం చేయవచ్చు. కానీ ఇంటింటి సర్వేలో ఉపాధ్యాయులను భాగస్వాములను చేయడం అనేది లాక్డౌన్ స్ఫూర్తికి విఘాతం కలిగించే అంశమని, ఇప్పటికే ప్రభుత్వం ప్రజలను ఇళ్లకే పరిమితం చేయడం ద్వారా ఇప్పుడిప్పుడే వైరస్ రాష్ట్రంలో నమోదు అత్యల్పంగా ఉందని, ఈ తరుణంలో వేలాదిగా ఉపాధ్యాయులను సర్వేలో పాల్గొనేలా చేయడం ద్వారా ఉపాధ్యాయుల కుటుంబాలను కూడా ఆందోళనలోకి నెట్టే పరిస్థితి వస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉన్న ఉపాధ్యాయుల్లో డెబ్బై శాతం మంది నలభై నుండి నలభై అయిదు సంవత్సరాలు వయస్సు పైబడిన వారేనని, వీరిలో సగానికి సగం వివిధ దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ ఉండేవారే అధికమని, ఇలాంటి తరుణంలో వీరిని సర్వేలో భాగస్వాములను చేయడం ద్వారా వీరి ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని, ఉపాధ్యాయులకు సోకితే దాని తీవ్రత మరింత అధికంగా ఉంటుందని భయాందోళనలకు గురవుతున్న ఉపాధ్యాయులు ఈ కరోనా సర్వే విధులు తమకు వద్దని చెబుతున్నారు. ఒకవేళ విధులు తప్పనిసరిగా కేటాయించ వలసి వచ్చినట్లయితే కొన్ని మినహాయంపులు కోరుతున్నారు. ఉపాధ్యాయుల్లో సగానికి సగం పని చేస్తున్న ప్రాంతంలో నివాసం ఉండటం లేదు. కరోనా ప్రభావం వల్ల వారు స్వస్థలాలకి వెళ్ళడం జరిగింది. అలాంటి వారిని మళ్లీ సర్వేల్లో పాల్గొనేటట్లు చేయడం పెద్ద రిస్కుతొ కూడుకున్న అంశమని, మహిళా ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని, యాభై ఏళ్లు పైబడి వయస్సు ఉన్న ఉపాధ్యాయులకు సర్వే విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని, హృద్రోగులు, వికలాంగులు, గర్భిణులు, ఇతర తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి మినహాయింపు ఇవ్వాలని, తగిన రక్షణ కవచాలను అందించాలని, సర్వేలో పాల్గొనే వారికి బీమా సౌకర్యం కల్పించాలని, ఉపాధ్యాయులకు స్థానిక పట్టణ, నగర, వార్డ్ లేదా కౌన్సిల్ పరిధిలోనే విధులు కేటాయించాలని, భార్యాభర్తలు ఇద్దరూ ఉపాధ్యాయులయితే ఒకరికి విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు కోరుతున్నారు.
ఇప్పటికే వాలెంటిర్లు, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది సహకారంతో గ్రామాలు, పట్టణాలు, నగరాలలో సర్వే చేసినప్పటికీ పూర్తి స్థాయిలో జరగలేదనే సందేహంతో ప్రభుత్వం మరోసారి కరోనా సర్వే చేస్తున్నందువల్ల సిబ్బందికి భద్రత, రక్షణ కల్పించాలి. క్షేత్ర స్థాయిలో కరోనా సర్వేలో పాల్గొనే ఉపాధ్యాయ, వైద్య సిబ్బంది, వాలెంటిర్లకు, ఆశ వర్కర్లుకు మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు, రక్షణ కోసం మరిన్ని పరికరాలు అందజేయాలి. ఇప్పటికే చాలా చోట్ల వైద్యం చేస్తున్న డాక్టర్లకు, వైద్య సిబ్బందికి కరోనా సోకడం గమనిస్తున్నాము. అదేవిధంగా ప్రస్తుతం ఉపాధ్యాయులను సర్వే నిమిత్తం ప్రభుత్వం వినియోగించే సమయంలో వీరిని కరోనా బారిన పడకుండా కాపాడుకోవడం కోసం, రక్షణ కోసం మరింత భద్రతా ప్రమాణాలు కలిగిన సేఫ్టీ పరికరాలు అందించాల్సిన అవసరం ఉంది.
- వాసిలి సురేష్
9494615360

0 Comments:
Post a Comment