పూణె: కోవిడ్-19 వ్యాధికి కారణమయ్యే కరోనా వైరస్‌ను ఎట్టకేలకు భారతీయ శాస్త్రవేత్తలు పట్టుకున్నారు. వైరస్‌ను ఫొటో తీశారు. ట్రాన్స్‌మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజింగ్‌ను ఉపయోగించి పూణెలోని శాస్త్రవేత్తలు ఫొటో తీశారు. ఈ చిత్రం ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైంది. ఈ ఏడాది జనవరి 30న తొలి కరోనా కేసు నమోదైంది. దీనిని పూణెలోని ప్రయోగశాల నిర్ధారించింది. చైనాలోని వూహాన్‌లో మెడిసిన్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు తిరిగి భారత్ చేరుకున్నారు. వీరందరికీ కోవిడ్-19 సోకినట్టు నిర్ధారణ అయింది. వీరిలో ఓ మహిళ గొంతును శుభ్రం చేస్తుండగా ఈ వైరస్.. 'సార్స్-కోవ్-2'ను గుర్తించి ఫొటో తీశారు.
'సార్స్-కోవ్-2' వైరస్ దాదాపు 'మెర్స్-కోవ్' వైరస్‌ను పోలి ఉంది. ఇది 2012లో మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్‌కు కారణమైంది. 2002లో సార్స్-కోవ్ వైరస్ 'సెవర్ ఆక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్)కు కారణమైంది.
కరోనా వైరస్ చూడడానికి కిరీటంలా కనిపిస్తుంది. దీనిపైన కనిపించే చిన్నచిన్న తంతుల వల్ల ఈ వైరస్‌కు ఆ పేరు వచ్చింది. కరోనా అంటే లాటిన్‌లో కిరీటం అని అర్థం. ప్రొటీన్, చక్కెర గ్రాహకాలతో సహా పలు రకాల గ్రాహకాలను గుర్తించేందుకు ఇవి అభివృద్ధి చెందాయి. వైరల్ అటాచ్‌మెంట్ కోసం హోస్ట్-సెల్-సర్ఫేస్ గ్రాహకాన్ని గుర్తించడం ద్వారా కణాలలోకి ప్రవేశిస్తాయి. ఆపై ప్రవేశానికి వైరల్, హోస్ట్ పొరలను కలుపుతాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ జనరల్ నిర్మల్ కె.గంగూలీ వివరించారు.
క్లినికల్ శాంపిల్స్‌లో ఉత్పరివర్తనాలను అధ్యయనం చేయడానికి, వైరస్ జన్యు మూలం, పరిణామాన్ని గుర్తించడంలో తాజా చిత్రాలు కీలకంగా మారాయని గంగూలీ తెలిపారు. ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు ఎలా సోకింది? ప్రజల నుంచి ప్రజలకు ఎలా వ్యాప్తి చెందుతోంది? అన్నది తెలుసుకోవడానికి ఈ చిత్రాలు సహాయపడతాయని డాక్టర్ గంగూలీ పేర్కొన్నారు.

0 Comments:
Post a Comment