ఉద్యోగులు తమకు కేటాయించిన విధులను నిర్వర్తించడానికి నిరాకరించినా, సమాచారం ఇవ్వకుండా వెళ్లినా.. వారికి ఏడాది వరకు జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సీఎస్ నీలంసాహ్ని జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారెవరైనా శిక్షార్హులవుతారు. విపత్తు సహాయక చర్యల్లో కేటాయించిన నిధులు, సామగ్రిని ఉద్యోగులు దుర్వినియోగం చేస్తే గరిష్ఠంగా రెండేళ్లవరకు జైలుశిక్ష విధిస్తారు. విపత్తు గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ఏడాది వరకు జైలుశిక్ష లేదా జరిమానా ఉంటాయి. ప్రభుత్వం విభాగం తప్పు చేస్తే దాని అధిపతిని బాధ్యులను చేస్తారు. నిబంధనలు అమలు చేయకపోతే కంపెనీలు, కార్పొరేట్ సంస్థలపైనా చర్యలు ఉంటాయి.
విధులు నిర్వర్తించకుంటే జైలు శిక్ష

0 Comments:
Post a Comment