దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. నిన్నటి వరకు 496 ఉన్న కరోనా కేసుల మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి 536కి చేరుకుంది.ఈ మేరకు తాజా వివరాలతో భారత వైద్యపరిశోధన మండలి(ఐసీఎంఆర్) బులిటెన్ విడుదల చేసింది. మొత్తం 21,804 మంది నుంచి 22,694 నమూనాలు సేకరించినట్లు అందులో పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 10కి చేరిన విషయం తెలిసిందే.
మరోవైపు కరోనా తీవ్రత పెరిగిపోతుండటంతో ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మంగళవారం రాత్రి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
లాక్‌డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడుతున్నప్పటికీ.. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.'' ఇది కర్ఫ్యూ తరహా వాతావరణం. ప్రతి నగరం, ప్రతి ఊరు, ప్రతి పట్టణం, ప్రతి వీధి లాక్‌డౌన్. దీన్ని ప్రతిఒక్కరూ విధిగా పాటించాలి. ఏ ఒక్క పౌరుడూ గడప దాటి బయటకు రావొద్దు. జనతా కర్ఫ్యూకు మించి లాక్‌డౌన్‌ను అమలు చేస్తాం'' అని చెప్పారు.

0 Comments:
Post a Comment