న్యూఢిల్లీ: చాపకింద నీరులా దేశాన్ని కబళిస్తున్న కరోనా మహమ్మారి.. భారత్ లో మూడోదశకు చేరిందన్న వార్తలను కేంద్ర ఆరోగ్య శాఖ కొట్టిపారేసింది. గురువారం మీడియాతో మాట్లాడిన ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ఈ విషయాన్ని స్పష్టంచేశారు. దేశంలో కరోనా వ్యాప్తి మూడోదశకు చేరిందనడానికి కావలసిన ఆధారాలేవీ లేవని ఆయన తేల్చిచెప్పారు. 'నిజమే.. కొన్ని కేసుల్లో బాధితులకు కరోనా ఎలా సోకిందో చెప్పలేకపోయారు. కానీ దాన్ని మాత్రమే కారణంగా చూపి వైరస్ వ్యాప్తి మూడోదశకు చేరిందనడం తప్పు. ఎందుకంటే అలాంటి కేసులు చెదురుమదురుగానే వెలుగుచూశాయి' అని ఆయన పేర్కొన్నారు. కాగా, భారతదేశంలో ఇప్పటివరకు 690పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.వీరిలో 13 మంది మరణించారు.
0 Comments:
Post a Comment