ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు పట్టణాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇప్పుడు మరో కేసు నమోదైంది. విశాఖకు చెందిన ఓ వ్యక్తికి కరోనా వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా మెడికల్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 12కు చేరిందని పేర్కొంది. కాగా, విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 26,590 మంది వచ్చినట్లు గుర్తించినట్లు తెలిపింది. 25,942 మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచామని, కరోనా అనుమానిత లక్షణాలతో 117మందికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.
ఇదిలా ఉండగా.. ఏపీలో కరోనా పరీక్షలు చేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) అనుమతి ఇచ్చింది.
విజయవాడలోని సిద్దార్థ మెడికల్ కాలేజీ, కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. అటు.. రాష్ట్రంలోని 13 ప్రైవేట్ మెడికల్ కాలేజీలను జిల్లా ప్రత్యేక కోవిడ్-19 ఆస్పత్రులుగా మార్చుతూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది.

0 Comments:
Post a Comment