మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: మల్కాన్‌గిరిలోని ప్రభుత్వ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయుడు కరోనాపై వాట్సాప్‌లో అసత్య ప్రచారం చేస్తున్న నేరంపై పోలీసులు శుక్రవారం రాత్రి కొరాపుట్‌లో అరెస్టు చేశారు. కొరాపుట్ జిల్లాలో ఓ వ్యక్తికి కరోనా వ్యాధి సోకినట్లు ఓపెన్ యూనివర్సిటీలో ఓ వాట్సాప్ గ్రూపులో ఆయన పోస్టు చేశారు. పోలీసులు, ప్రభుత్వం ఈ విషయంపై దర్యాప్తు చేశారు. దర్యాప్తు తర్వాత ఇది అబద్ధమని తేలడంతో ఉపాధ్యాయున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయమై మల్కాన్‌గిరి ఐఐసీ రామ్‌ప్రసాద్‌నాగ్ మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా అసత్య ప్రచారాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని, కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామన్నారు.
0 Comments:
Post a Comment