ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. మృతుల సంఖ్య, బాధితుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ నియంత్రణలో భాగంగా కరోనా బాధితులు.. అనుమానితులు అందరూ క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయితే వెంటనే చికిత్స అందిస్తున్నారు. అంతా సరే.. అసలు క్వారంటైన్ అంటే ఏమిటి? ఈ విధానం ఎక్కడ పుట్టింది? ఎవరు పాటించారు? ఇలాంటి సందేహాలకు సమాధానం ఇదిగో..
క్వారంటైన్ ఇటీవల అందరిని నోట నానుతున్న పదం. కానీ ఈ క్వారంటైన్ ఇప్పుడు పుట్టింది కాదు.. మధ్యయుగంలోనే అప్పటివారు దీన్ని పాటించారు.
14వ శాతబ్ధంలో ప్రపంచవ్యాప్తంగా ప్లేగు వ్యాధి ప్రబలింది. దీంతో ఇటలీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ప్లేగు ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ఓడల ద్వారా తమ దేశంలోనూ ప్లేగు వ్యాపిస్తుందని భావించిన ఇటలీ.. వెంటనే వారిని కట్టడి చేయాలని భావించింది. ఈ క్రమంలో 40 రోజులపాటు విదేశాల నుంచి వచ్చిన వారిని ఇతరులతో కలవనీయకుండా ప్రత్యేక గది(ఐసోలేషన్)కి తరలించాలని నిర్ణయించింది. దీనినే ఐసోలేషన్ ఇటలీ భాషలో 'క్వారంట జోర్ని' అంటే ' 40 రోజులు' అని అర్థం. ఆ తర్వాత ఈ పదాలు కాస్త 'క్వారంటినో', 'క్వారంటైన్'గా రూపాంతరం చెందాయి. ఈ విధానం వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందకుండా బాగా పనిచేసేది.
* 1665లో బ్రిటన్‌లోనూ ప్లేగు వ్యాధి 14 నెలలపాటు తన ప్రభావం చూపించింది. అయితే ఇయమ్ అనే గ్రామంలో ప్రజలు ప్లేగు ఇతరులకు సోకకూడదని నిర్ణయించుకున్నారు. గ్రామం మొత్తం క్వారంటైన్‌లోని వెళ్లింది.
* 1793లో అమెరికాలో పచ్చకామెర్లు సోకడం మొదలైంది. దీనివల్ల యూఎస్ మొత్తంగా 5వేల మంది మరణించారు. ఈ అనుభవాన్ని దృష్ట్టిలో పెట్టుకొని కామన్‌వెల్త్ ఆఫ్ ఫిలడెల్ఫియా ఏకంగా దెలావర్ నదిపై క్వారంటైన్ కేంద్రాన్ని నిర్మించింది.
* 1814లో ఆస్ట్రేలియా తొలిసారి క్వారంటైన్‌ను పాటించింది. జులై 28న ఇంగ్లాండ్ నుంచి సుర్రీ అనే ఓడ సిడ్నీ ఓడరేవుకు చేరుకుంది. అయితే ఇంగ్లాండ్ నుంచి సిడ్నీకి ప్రయాణిస్తున్న సమయంలో ఆ ఓడలో 46 మంది టైఫాయిడ్ జ్వరంతో మరణించారు. దీంతో సిడ్నీకి చేరుకున్న వెంటనే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ ఓడను.. ఓడలో ఉన్న వారిని క్వారంటైన్ చేసింది.
* 1830లో అమెరికాలో కలరా ప్రబలింది. దీనికి అరికట్టేందుకు అప్పటి న్యూయార్క్ మేయర్ క్వారంటైన్‌ను తప్పని సరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఓడలు, వాహనాలపై న్యూయార్క్‌లోకి వచ్చే వారిని కచ్చితంగా క్వారంటైన్‌లో ఉంచాలన్నారు. అయితే ఈ క్వారంటైన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. చాలా మంది వలసదారులు క్వారంటైన్ నుంచి తప్పించుకొని న్యూ ఇంగ్లాండ్‌లోని ప్రధాన నగరాల్లోని ప్రవేశించారు.
* ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యంత విషాదాన్ని మిగిల్చిన స్పానిష్ ఫ్లూ సమయంలోనూ అమెరికా, యూరప్ దేశాలు క్వారంటైన్ విధానాన్ని అమలు చేశాయి. 1918లో వచ్చి స్పానిష్ ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా 5కోట్ల మందిని బలితీసుకుంది. దీనిని నియంత్రించేందుకు అమెరికా, యూరప్ ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నాయి. వైరస్ సోకిన వ్యక్తులను క్వారంటైన్ చేశాయి.
* యూరప్‌లో స్మాల్‌పాక్స్ వచ్చి.. దాదాపు తగ్గిపోతున్న సమయంలో 1972లో యూగోస్లేవియాలో స్మాల్‌పాక్స్‌ను గుర్తించారు. సీరియస్‌గా తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.. దీనిపై తీవ్రంగా పోరాడింది. యూగోస్లేవియా ప్రభుత్వం మిలటరీ సాయంతో దేశవ్యాప్తంగా క్వారంటైన్‌ను విధించింది.
ఈ క్వారంటైన్ వైరస్‌ను మొత్తంగా తరిమికొట్టలేకపోయినా.. ఒకరి నుంచి మరొకరికి సోకకుండా మాత్రం ఆపుతోంది. తాజాగా కరోనా వైరస్ విషయంలోనూ ప్రపంచదేశాలన్నీ ఈ క్వారంటైన్‌నే పాటిస్తున్నాయి. అయితే మారిన పరిస్థితులు, వైద్యశాస్త్రంలో వచ్చిన సాంకేతిక మార్పులు, వైరస్ లక్షణాల దృష్ట్యా క్వారంటైన్ సమయం 14 రోజులకు తగ్గించాయి.

0 Comments:
Post a Comment