ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ భయం వెంటాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా అనిమానితులను ఐసోలేషన్ వార్డులకు తరలించారు. విదేశాల నుంచి వస్తున్నవారిపై నిఘా పెట్టారు అధికారులు. 14 రోజుల పాటూ వారి ఇళ్లలోనే ఉండాలని వారికి సూచిస్తుంది ప్రభుత్వం. అలాగే జిల్లాలవారీగా ప్రత్యేకంగా అధికారుల్ని నియమించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తన్నారు.
ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా లాక్ డౌన్ ప్రకటించింది ప్రభుత్వం.. దశాబ్ధాల కాలంగా ప్రజానీకం ఎప్పుడూ వినని సరికొత్త పదమే ఇది. సమాజంలో కరోనా వైరస్‌పై ఆందోళన తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో మాయదారి వైరస్ భారి నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తోంది.
ప్రజలు కూడా స్వీయ నిర్బంధం పాటించి తమని తాము వైరస్ బారి నుంచి కాపాడుకోవాలని అధికారులు కోరుతున్నారు.
అయితే అక్కడక్కడ మాత్రం.. ఇంకా కూడా కొందరు ప్రభుత్వానికి సహకరించట్లేదు.. అయితే అటువంటివారి కోసం ఏపీ ప్రభుత్వం కొత్తగా చట్టం తీసుకుని వచ్చింది. నిర్ణయించిన సమయాల్లో తప్ప ఇళ్లను వదిలి బయటకు రావద్దని, ఒకవేళ వస్తే.. ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం ఆరు నెలల పాటు జైలుకు పంపించడమే కాకుండా రూ. వెయ్యి జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఈ మేరకు అధికారం సంబంధిత అధికారులకు కల్పించింది ప్రభుత్వం.
లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉన్న సేవలు తప్ప బహిరంగ ప్రదేశాలలో 10 మందికి మించి ఉండకూడదు అని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల అమలు, పర్యవేక్షణ అధికారాన్ని జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, డీఎం అండ్ హెచ్‌ఓలు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలకు కట్టబెట్టింది.
కాగా, పోలీస్, వైద్య ఆరోగ్యం, పట్టణ స్థానిక సంస్థలు, అగ్నిమాపక, విద్యుత్, తాగునీరు, పురపాలక సేవలు, బ్యాంకులు, ఏటీఎం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలు, ఆహారం, సరుకులు, పాలు, బ్రెడ్, పండ్లు, కూరగాయలు, మాంసం, చేపల రవాణా, గిడ్డంగులు, ఆసుపత్రులు, మందుల దుకాణాలు, కళ్ల జోళ్ల దుకాణాలు, ఔషధ తయారీ, వీటికి సంబంధించిన రవాణా, టెలికాం, ఇంటర్నెట్ సేవలు, ఐటీ సేవకులు, నిత్యావసర వస్తువుల తయారీ యూనిట్లు, వాటి సరఫరా దారులు, కరోనా నియంత్రణ కార్యకలాపాల్లో పాల్గొనే ప్రైవేట్ సంస్థలు, పెట్రోల్ పంపులు, ఎల్పీజీ గ్యాస్, ఆయిల్ ఏజెన్సీల రవాణా, గిడ్డంగుల్లో కార్యకలాపాలు, ఆహారం, ఔషధాలు, వైద్య పరికరాలు సరఫరా చేసే ఈ కామర్స్ సైట్లకు మినహాయింపునిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Good information
ReplyDelete