ఈనాడు, అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులుగా పనిచేస్తున్న ముస్లింలు శుక్రవారం ప్రార్థనల నిమిత్తం మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు కార్యాలయం విడిచి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రభుత్వ విభాగాల్లో రెగ్యులర్ ఉద్యోగులుగా ఉన్న ముస్లింలకు ప్రభుత్వం ఇదివరకే ఈ సదుపాయం కల్పించింది. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులుగా ఉన్న ముస్లింలకూ అవకాశం కల్పించాలని మైనారిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోరడంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్టు శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని పేర్కొన్నారు.
ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు అనుమతి

0 Comments:
Post a Comment