ఒంగోలు: రాష్ట్రంలో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. దిల్లీ వెళ్లి వచ్చిన వారికి సంబంధించి కొందరి రిపోర్టులు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరి కొన్ని పాజిటివ్ కేసులు బయటపడే అవకాశముందని భావిస్తున్నారు. జిల్లాలో 3,500 మందిని క్వారంటైన్ చేసేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ భాస్కర్ తెలిపారు. దిల్లీలో మత ప్రార్థనలకు ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి వెళ్లారని, ఆయా రైళ్లలో వారితో పాటు ప్రయాణించిన ప్రకాశం జిల్లా వాసులపైనా ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. దిల్లీ వెళ్లి వచ్చిన 132 మందికి వైద్య పరీక్షలు చేయించామని, తాజాగా 8 పాజిటివ్ కేసులు వచ్చాయని వెల్లడించారు.
''ఒంగోలు, చీరాలలో వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టాం. కారంచేడు, కందుకూరు, కనిగిరిలో కొత్త కేసులు వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో కార్యాచరణ అమలు చేస్తున్నాం. దిల్లీ వెళ్లి వచ్చిన ఒంగోలు, మార్కాపురం వాసుల ఫలితాలు రావాల్సి ఉంది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని పర్యవేక్షిస్తున్నాం'' అని కలెక్టర్ వివరించారు.

0 Comments:
Post a Comment