సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నందుకు యావత్‌దేశ ప్రజలు తనను క్షమించాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహమ్మారి కరోనా వైరస్ నుంచి దేశ ప్రజలను రక్షించడం కోసమే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లు మోదీ వివరించారు. దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తున్న తరుణంలో ప్రధాని ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి 'మాన్ కీ బాత్' కార్యక్రమంలో భావోద్వేగ ప్రసంగం చేశారు. ప్రజలను ఎదుర్కొంటున్న సమస్యలకు తనను క్షమించాలని కోరారు.
అలాగే వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రజలకు పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రజలు సంయమనంతో ఉండాలని, నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చిరించారు. కరోనో ఒక ప్రాంతానికే చెందిన కాదని ప్రపంచం నలుమూలలా వైరస్ వ్యాప్తి చెందినట్లు మోదీ గుర్తుచేశారు.
మాక్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ 'కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాము. దీని వల్లన ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. ప్రజలు ఎదర్కొంటున్న సమస్యలను నన్ను క్షమించండి. మీ రక్షల కోసమే లాక్‌డౌన్ విధించాము. కొందరు ఇంకా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవడంలేదు. అన్నింటికన్నా.. దేశ ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను. వారి అనుభవాలను తెలుసుకుంటున్నాను. కరోనాతో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.. ఇది నివారించదగ్గ వ్యాధి.
లాక్‌డౌన్‌లో పాల్గొనడమంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే. వైరస్‌ను అరికట్టడానికి లాక్‌డౌన్ ఒక్కటే ప్రత్యామ్నాయం. లక్ష్మణ రేఖను అందరూ పాటించాల్సిందే. కరోనా కేసులు అకస్మాత్తుగా పెరగటం కొంత ఆందోళనకరమే. దీనివల్లన అభివృద్ధి చెందిన దేశాలు కూడా కుప్పకూలిన సందర్భాలు ఉన్నాయి. మానవత్వంతో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా వందనాలు. సేవాభావంతో రోగికి చికిత్స చేసే వైద్యులు ఎంతో గొప్పవారని ఆచార్య చరకుడు ఎప్పుడో చెప్పారు. వైద్యులందరికీ నా ధన్యవాదాలు. వారు అందిస్తున్న సేవలు మరువలేనివి.
నిత్యవసర సరుకులు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. దీనికి అందరూ సహకరించాలి. ఈ కష్ట సమయంలో కూడా ప్రజలకు సేవలు అందిస్తున్న బ్యాంకింగ్, డెలివరీలు అందిస్తున్న ఈ-కామర్స్ సంస్థలకు ధన్యవాదాలు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారిని కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇది సరైనది కాదు. వారిపై సానుభూతి చూపించండి. వైరస్ వ్యాప్తి నియంత్రణకు సామాజిక దూరం పాటించండి' అని పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment