'చైనా వైరస్'అంటూ ప్రపంచం చేత విమర్శలు, చీత్కారాలు ఎదుర్కొన్నా.. కరోనా మహమ్మారిని తమ దేశం నుంచి తరిమేయడంలో చైనా విజయం సాధించింది. తొలుత సెట్రల్ చైనాలోని హుబె ప్రావిన్స్ లోగల వుహాన్ సిటీలో.. 2019 డిసెంబర్ 31 న ఈ వైరస్ ను గుర్తించడం, అనతికాలంలోనే వైరస్ విజృంభించి అక్కడ 3277 మంది ప్రాణాలు హరించడం తెలిసిందే. చైనాలో మొత్తం 81093 కేసులు నమోదుకాగా, 72703మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కోరానాకు విరుగుడు మందు కనిపెట్టనప్పటికీ వైరస్ వ్యాప్తిని నివారించడంలో చైనా అనుసరించిన విధానాల్నే ప్రపంచ దేశాలూ అనుసరిస్తున్నాయి. ఇదిలా ఉంటే లాక్ డౌన్ కు సంబంధించి చైనా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
రెండు తర్వాత..
రెండు నెలల తర్వాత..
కొత్త రకం కరోనా వైరస్ కు జన్మస్థలమైన వూహాన్ సిటీ, హుబే రాష్ట్రం గత రెండు నెలలుగా లాక్ డౌన్ లో ఉంది. అక్కడి సీఫుడ్ మార్కెట్ నుంచి వైరస్ విస్తరించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినప్పటికీ.. అసలది ఎలా పుట్టిందనే విషయాన్ని ఇంకా స్పష్టంగా పేర్కొనలేదు. వూహాన్ లో ఈఏడాది జనవరి 11న తొలి కరోనా మరణం సంభవించింది. పదిరోజుల వ్యవధిలోనే మరో 17 మంది కన్నుమూయడంతో చైనా ప్రభుత్వం.. జనవరి 23 నుంచి వుహాన్ నగరాన్ని లాక్ డౌన్ చేసింది. సరిగ్గా రెండు నెలల తర్వాత మళ్లీ ఈ నగరం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోనుంది. ఈ మేరకు మంగళవారం ఒక కీలక ప్రకటన వెలువడింది.
షురూ..
రవాణా షురూ..
కొవిడ్-19 ఎపిసెంటర్ గా పేరుపొందిన వూహాన్ సిటీతోపాటు హుబె ఫ్రావిన్స్ అంతటా లాక్ డౌన్ ఎత్తేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు, బుధవారం(మార్చి 25) నుంచి అక్కడ సాధారణ రవాణా వ్యవస్థను పునరుద్ధరించనున్నట్లు తెలిపింది. మూడు నెలలపాటు ఇళ్లకే పరిమితమైన ప్రజలు.. తగిన జాగ్రత్తలతో బయటికి రావొచ్చని, బుధవారం నుంచి రైళ్లు, బస్సులు, విమాన సర్వీసులు వాడుకొవచ్చని జిన్ పింగ్ సర్కారు ఆదేశించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
జిన్ ప్రకటనతో..
జిన్ పింగ్ ప్రకటనతో..
చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ ఈ నెల 10న వైరస్ ఎపిసెంటర్ వూహార్ లో పర్యటించి, అక్కడి సైంటిస్టులు, డాక్టర్లతో సమావేశం తర్వాత.. 'కరోనా వ్యాప్తిని సమూలంగా అడ్డుకున్నాం. ఇకపై వైరస్ మా దేశం నుంచి వ్యాపించబోదు'అని ప్రకటించారు. అయితే ప్రెసిడెంట్ ప్రకటన తర్వాత మరో 10 రోజులపాటు ప్రజల్ని బయటికి రానివ్వలేదు. మార్చి 20 తర్వాత రిస్ట్రిక్షన్ ఆర్డర్స్ సడలిస్తూ.. మొత్తానికి మార్చి 25 నుంచి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయనున్నారు. అయితే..
ఇంకా ..
ఇంకా ముగియలేదు..
వైరస్ ఎపిసెంటర్ హుబే ఫ్రావిన్స్ లో లాక్ డౌన్ ఎత్తేసినంత మాత్రాన చైనా కరోనా బారి నుంచి పూర్తిగా విముక్తమైనట్లు కాదని, ఆస్పత్రుల్లో ఇప్పటికీ వేల మంది వైరస్ తో బాధపడుతున్నవాళ్లున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు. మనుషుల ప్రాణాలు కాపాడుకోవడంతోపాటు దాదాపు చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థకు మళ్లీ జీవం పోయడం కత్తిమీద సామేనని వారు అభిప్రాయపడ్డారు.
0 Comments:
Post a Comment