Coronavirus | Covid 19 : కరోనా వైరస్ పట్టి పీడిస్తుండటంతో... చైనాలోని ది నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాడింగ్ కమిటీ... ఓ కీలక ప్రతిపాదనను ఆమోదించింది. దేశవ్యాప్తంగా శాశ్వతంగా వన్యప్రాణుల వాడకాన్ని (consumption) నిషేధించింది. ఇది చైనా తీసుకున్న ఓ అసాధారణ నిర్ణయం అనుకోవచ్చు. ఎందుకంటే చైనాలో వన్యప్రాణుల పరిశ్రమ చాలా పెద్దది. దాని విలువ రూ.5,63,508 కోట్లు. ప్రజల ఆరోగ్యం అలాగే పర్యావరణ రక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా తెలిపింది. సింపుల్‌గా చెప్పాలంటే... ఇకపై చైనీయులు... వన్యమృగాల్ని తినరు. మన దేశంలో వన్య మృగాలు అనగానే మనకు సింహాలు, పులులు వంటివి గుర్తొస్తాయి. చైనాలో వన్యమృగాలంటే... మొసళ్లు, పాములు, ఆలుగులు (pangolins), అడవి పందులు ఇలా చాలా ఉంటాయి.
ఇకపై వాటిని వేటాడటం, అమ్మడం, వండటం, తినడం అన్నీ నేరాలే.
కరోనా వైరస్... చైనా... వుహాన్ నగరంలోని హ్యూనాన్ సీఫుడ్ హోల్‌సేల్ మార్కెట్‌లో తొలిసారి బయటపడింది. అది సివెట్స్, పందులు, పాంగోలిన్స్ వంటి వాటిలో ఏదో ఒక దాని ద్వారా వ్యాపించి ఉంటుందని చైనా అనుకుంటోంది. ఐతే... ఈ జీవుల్ని చైనా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం ప్రకారం వాడటంపై నిషేధం ఉంది. అయినప్పటికీ ఇల్లీగల్‌గా వీటిని వేటాడి, చంపి అమ్మేస్తున్నారు. కానీ వీటిపై రకరకాల వైరస్‌లు జీవిస్తున్నాయి. అవి మనుషులకు వ్యాపిస్తున్నాయి.
ఈ కొత్త ప్రతిపదానలో నీటిలో జీవించే ప్రాణులు, పౌల్ట్రీ, పెంపకం పందుల వంటివి లేవని చైనా అధికారులు తెలిపారు. కొత్త రూల్ ప్రకారం... వన్యమృగాలపై పరిశోధనలు చెయ్యాలన్నా చైనా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. మొత్తానికి కరోనా వైరస్ వచ్చి... ఇంత మందిని బలితీసుకుంటే గానీ... చైనాకు తాను చేస్తున్న తప్పేంటో అర్థం కాలేదన్నమాట.

0 Comments:
Post a Comment