మధ్యతరగతికి ఊరట
ఈఎంఐలు మూడు నెలలు వాయిదా
తగ్గనున్న వడ్డీ రేట్లు
ఆర్‌బీఐ విధాన నిర్ణయాలు
2019-20 లో 5 శాతం వృద్ధి రేటు అనుమానమే...
కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్-19) విరుచుకుపడి ప్రజా జీవితం గందరగోళంలో పడిపోవటానికి తోడు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఎదురైన నేపధ్యంలో భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) శుక్రవారం కొన్ని ఉపశమన చర్యలు ప్రకటించింది. వడ్డీ రేట్లు తగ్గింపు, రుణ వాయిదాలు వాయిదా వేయటం, ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యత పెంచటం, బ్యాంకింగ్ వ్యవస్థకు భరోసా ఇవ్వటం... వంటి నిర్ణయాలు ఇందులో ఉన్నాయి. దీనివల్ల మధ్యతరగతి ప్రజానీకానికి ఊరట కలిగే అవకాశం ఏర్పడింది. రుణ వాయిదాలను మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. అంటే అప్పులు తీసుకున్న వారు బ్యాంకులకు చెల్లించాల్సిన మార్చి, ఏప్రిల్, మే నెలల రుణ వాయిదాలను ఇప్పటికిప్పుడు కాకుండా ఆ తర్వాత చెల్లించే అవకాశం ఏర్పడింది. పట్టణ/ నగర ప్రాంతాల్లో అప్పులు తీసుకొని నెలా నెలా ఇన్‌స్టాల్‌మెంట్లు కట్టే ఎంతో మందికి ఇది మేలు చేసే నిర్ణయం. అంతేగాక కొత్త రుణాల జారీకి ఏమాత్రం వెనుకాడవద్దని, సాధ్యమైనంత అధికంగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలని ఆర్‌బీఐ ఈ సందర్భంగా సూచించింది. రెపో, రివర్స్ రెపో రేట్లను తగ్గించటంతో పాటు, బ్యాంకుల సీఆర్‌ఆర్ (నగదు నిల్వ నిష్పత్తి)ని కూడా గణనీయంగా తగ్గించింది. ఈ మూడు వరుసగా 75, 90, 100 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గాయి. దీంతో రుణాలపై వడ్డీరేట్లు దిగివచ్చే అవకాశం ఏర్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) ఇంతకు ముందు అనుకున్నట్లుగా 5 శాతం వృద్ధి రేటు సాధ్యం కాకపోవచ్చని ఆర్‌బీఐ అనుమానాన్ని వెలిబుచ్చింది. కోవిడ్-19 వల్ల ఆర్థికంగా దేశానికి పెనునష్టం వాటిల్లుతుందని అంచనా వేసింది.

0 Comments:
Post a Comment