కరోనా లాక్డౌన్ సమయంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు మూడు నెలల పెన్షన్ను ముందుగానే చెల్లించనుంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ నెల మొదటి వారంలోనే మూడు నెలల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానుంది.
60 నుంచి 79 ఏళ్ల లోపున్న వృద్ధులకు రూ.200/- పెన్షన్ సహకారం అందిస్తున్న కేంద్రం.. 79 ఏళ్ల లోపు వితంతువులకు, దివ్యాంగులకు రూ.300/- చొప్పున ఇస్తోంది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రూ.500/-
దాదాపు 3 కోట్లమంది లబ్ధిదారులకు.. మూడు నెలల పెన్షన్ ముందుగానే చెల్లించేలా నిర్ణయం తీసుకుంది కేంద్రం. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులకు భరోసా ఇస్తోంది.జాతీయ సామాజిక సహకార కార్యక్రమం (ఎన్ఎస్ఏపీ)లో భాగంగా పింఛను పొందుతున్న 2.98 కోట్ల మంది లబ్ధిదారులకు మూడు నెలల పెన్షన్ మొత్తాన్ని ఏప్రిల్ నెలలోనే బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది కేంద్రం.ప్రస్తుతం 60 నుంచి 79 ఏళ్ల లోపున్న వృద్ధులకు రూ.200/- పెన్షన్ సహకారం అందిస్తున్న కేంద్రం.. 79 ఏళ్ల లోపు వితంతువులకు, దివ్యాంగులకు రూ.300/- చొప్పున ఇస్తోంది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రూ.500/- చొప్పున చెల్లిస్తోంది.వీటితో పాటు రానున్న 3 నెలల పాటు.. రూ.1000/- పరిహారాన్ని అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తెలిపారు. ఈ పరిహారం రెండు దఫాలుగా బ్యాంకులో జమచేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
Also Read....
YSR PENSION STATUS CHECK
Ration Card status check
🔎YSR Arogyasri card Status
New.... Google Android Apps
0 Comments:
Post a Comment