జూన్ 30 వరకు ఆర్థిక సంవత్సరం!
పరిశ్రమల సంఘాల వినతి
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని (2019-20) జూన్ 30వ తేదీ వరకు పొడిగించాల్సిందిగా ప్రభుత్వాన్ని పరిశ్రమ సంఘాలు కోరాయి. సాధారణంగా మార్చి 31వ తేదీతో ప్రతి ఆర్థిక సంవత్సరం ముగస్తుంది. అయితే కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో, ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ స్థితిని పరిగణనలోకి తీసుకొని ఈ ఆర్థిక సంవత్సరాన్ని మరో మూడు నెలల పాటు అంటే జూన్ 30 వరకు పొడిగించాలని విన్నవించాయి. కార్యకలాపాలు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో మార్చి 31 వరకు కనబర్చిన పనితీరు ఆధారంగా పూర్తి ఆర్థిక సంవత్సరం పనితీరును లెక్కించడం సరికాదని తెలిపాయి. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులను అసోచామ్, సీఐఐ, ఫిక్కీ ప్రతినిధులు కలిసి ఈ వినతిని చేశారు. కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు పలు సలహాలు, సూచనలు చేశారు.

0 Comments:
Post a Comment