తెలంగాణలో పాటు ఏపీలో కూడా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం కొత్తగా రెండు కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఒకరికి, గుంటూరులో మరో మహిళకు కరోనా సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఈ రెండు కూడా ప్రైమరీ కాంటాక్ట్ కేసులు కావడం గమనార్హం. వీరిద్దరితో కలిపి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరింది. విశాఖకు చెందిన పేషెంట్- 12.. మార్చి 17న పేషెంట్-7ని కలిశారు. అనంతరం కరోనా లక్షణాలతో మార్చి 21న ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఐసోలేషన్‌లో ఉండగా.. పరీక్షల్లో కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇక గుంటూరుకు చెందిన పేషెంట్-13.. మార్చి 19న పేషెంట్-10ని కలిశారు. వైరస్ లక్షణాలతో ఆమె మార్చి 23న ఆస్పత్రిలో చేరి ఐసోలేషన్‌లో ఉన్నారు.
పరీక్షల్లో ఆమెకు కోవిడ్-19 ఉన్నట్లు శుక్రవారం నిర్ధారణ అయింది.
శుక్రవారం నాటికి రాష్ట్రంలో 317 శాంపిల్స్‌ను టెస్ట్ చేయగా 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ మరో 53 మంది నమూనాలను పరీక్షించగా ఇద్దరికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 13 కేసులు నమోదవగా.. ఒకరు డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 12 మంది రాష్ట్రంలోని ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

0 Comments:
Post a Comment