Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Wednesday, 12 February 2020

School Assembly Dt.12/2/2020

School Assembly Dt.12/2/2020

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం🙏*

*---12.02.2020--*

*GSRAO GK GROUPS*

 *🔍నేటి ముఖ్యమైన వార్తలు🔎*

*1.ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉండాలని.. జిల్లా స్థాయిలో వాటిని సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంటుందని సీఎం కేసీఆర్‌ అన్నారు.*

*2.ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-3 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగ నియామకానికి నిర్వహించిన పరీక్షా ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.*

*3.పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో పేదలకు వరాలు కురిపించింది. పేదలకు ఉచిత విద్యుత్‌ను ప్రకటించింది.*

*4.దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 'ఆమ్ ఆద్మీ పార్టీ'కే వరుసగా మూడోసారి పట్టం కట్టారు.*

*5.కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధికారికంగా పేరును పెట్టింది. కరోనాకు కోవిడ్‌-2019(covid-2019)ను పేరుగా నిర్ణయించినట్లు వెల్లడించింది*

*6.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనపై శ్వేతసౌధం కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 24-25 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నట్లు మంగళవారం వెల్లడించింది*

*7.1989 తర్వాత  టీమ్‌ఇండియా వైట్‌వాష్‌. 3-0తో సిరీస్‌ కైవసం చేసుకున్న న్యూజిలాండ్‌*

*👉నేటి సూక్తి.*

*మంచి అలవాట్ల తరువాత మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగినది మంచి జ్ఞాపకాలే.*

*🔆మంచి పద్యం🔆*

*అతి బాల్యములోనైనను,*
*బ్రతికూలపు మార్గములఁబ్రవర్తింపక స*
*ద్గతిమీఱ మెలఁగ నేర్చిన*
*నతనికి లోకమున సౌఖ్యమగును కుమారా!*

*👉తాత్పర్యం: ఓ కుమారా! ఎవడు లోకమునందు చిన్నవాడుగా నుండి ఉన్నప్పటిని, విరుద్ధముగా నడవక మంచిమార్గమున నడుచుచుండునో వాడు లోకమున సుఖముగా జీవింపగలడు.*

*♦నేటి ప్రశ్న♦*

*Q. స‌రిహ‌ద్దు గాంధీ గా పిల‌వ‌బ‌డిన‌ది ఎవ‌రు?*

*A: ఖాన్ అబ్దుల్ గ‌ఫార్ ఖాన్*

*Q. ఏ న‌గ‌రాన్ని 'ఎల‌క్ట్రానిక్ క్యాపిట‌ల్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు?*

*A: బెంగ‌ళూరు*

🌎 *చరిత్రలో ఈ రోజు*

👉 *12 ఫిబ్రవరి, 2020*
👉 *బుధవారం*
👉 *సంవత్సరములో 43వ రోజు 7వ వారం*
👉 *సంవత్సరాంతమునకు ఇంకా 323 రోజులు మిగిలినవి (ఇది లీపు సంవత్సరము)*
〰〰〰〰〰〰〰〰
🔴 *ప్రత్యేక  దినాలు*
🚩 *జాతీయ ఉత్పాదనా దినోత్సవం*
〰〰〰〰〰〰〰〰
🏀 *సంఘటనలు*
✴1961: శుక్ర గ్రహంపైకి మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌక  *(వెనెరా-1)*  ప్రవేశపెట్టబడింది.
〰〰〰〰〰〰〰〰
🌐 *జననాలు*
1809:  *చార్లెస్ డార్విన్,*  జీవ పరిణామ సిద్ధాంతకర్త, జీవావతరణం (ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్) పుస్తక రచయిత. (మ. ఏప్రిల్ 19, 1882)
[అతని పేరును తలుచుకుంటే చాలు ఎవరికైనా సరే వెనువెంటనే గుర్తుకు వచ్చేది పరిణామ సిద్ధాంతం. ప్రకృతిలో జీవజాతులు వేటికవే ఏక కాలంలో రూపొందినట్లు ఎంతో కాలం నుండి నమ్ముతూ వస్తున్న ప్రజానీకానికి - అదంతా వాస్తవం కాదని ఒక మాతృక నుంచి సకల జీవరాశులు క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఏర్పడతాయని, ఈ చర్య అనంతంగా కొనసాగుతూ ఉంటుందని మొట్టమొదటి సారిగా వివరించినవాడు చార్లెస్ డార్విన్ మాత్రమే. వానరుని నుంచి నరవానరుడు, నరవానరుని నుంచి నరుడు పరిణామ పరంగా ఉద్భవించాడని తెలిపి సంచలనం రేపిన ప్రకృతి శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్.]

1809:  *అబ్రహం లింకన్,*  అమెరికా 16 వ అధ్యక్షుడు. (మ. ఏప్రిల్ 15, 1865)
[ప్రశ్నించనిదే సమాధానం దొరకదు , ప్రయత్నించనిదే విజయం దక్కదు - అబ్రహం లింకన్]
[ ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మాజీ అమెరికా అధ్యక్షుడు. అమెరికా అంతర్యుద్ధ సమయంలో అత్యంత కార్యదక్షతతో పరిపాలించిన లింకన్ దురదృష్టవశాత్తూ అంతర్యుద్ధం ముగిసే సమయంలోనే హత్యగావింపబడ్డాడు.]

1824:  *స్వామి దయానంద సరస్వతి,*  ఆర్యసమాజ్ స్థాపకుడు. (మ.1883)
[అజ్ఙానాంధకారం, దారిద్య్రం, అన్యాయన్ని ఎదురించి పోరాడిన ముని. హిందు ధర్మ సంస్థాపనకు నడుం బిగించిన ఋషి. 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించి, ఎందరో స్వాతంత్ర్య సమర యోధులకు ప్రేరణ అయిన పండితుడు.]

1942:  *సి.హెచ్.విద్యాసాగర్ రావు,*  భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకుడు.

1962:  *జగపతిబాబు,*  (వీరమాచనేని జగపతి చౌదరి) తెలుగు సినిమా నటులు. ఇతడు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారులు. ఫిబ్రవరి 12, 1962న మచిలీపట్నంలో జన్మించారు. ఈయన కుటుంబ కథా చిత్రాలెన్నింటిలోనో నటించారు. దాదాపు 100 చిత్రాలలో నటించి ఏడు నంది పురస్కారములను అందుకున్నారు.

1962:  *ఆశిష్ విద్యార్థి,*  తెలుగు సినిమా ప్రతినాయకుడు, సహాయ పాత్రలు పోషిస్తుంటాడు..

1976:  *అశోక్ తన్వర్,*  భారతదేశ రాజకీయ నాయకుడు.
〰〰〰〰〰〰〰〰
⚫ *మరణాలు*
◾1713: *జహందర్ షా,*  మొఘల్ చక్రవర్తి. స్వల్పకాలం మాత్రమే (1712-1713) రాజ్యపాలన చేసాడు.  (జ.మే 10, 1661)

1804:  *ఇమ్మాన్యుయెల్ కాంట్,* ప్రముఖ జర్మన్ భావవాద తత్వవేత్త. ఇతను భావవాదం మరియు జడతత్వ శాస్త్రం పై ఎక్కువ మొగ్గు చూపేవాడు. ఇతను అన్ని సందర్భాలలో జడతత్వవాదానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇతను కొంతవరకు గతితర్కాన్ని కూడా అంగీకరించాడు. ఇతని ప్రభావం హెగెల్ మరియు కార్ల్ మార్క్స్ పైన కూడా కనిపిస్తుంది. (మ.ఏప్రిల్ 22, 1724)

1878:  *అలెక్సాండర్ డఫ్,*  స్కాట్లండుకు చెందిన క్రైస్తవ మిషనరీ. అతడు స్కాట్లండు చర్చికు మొట్టమొదట అంతర్జాతీయ మిషనిరీగా భారతదేశము వచ్చెను. 1980 జూలై 13 న డఫ్ ఈనాడు స్కాటిష్ చర్చ్ కాలేజీగా పిలువబడుతున్న జనరల్ శాసనసభ ఇన్సిట్ఞూషన్ ను స్థాపించెను. కలకత్తా విశ్వవిద్యాలయం స్థాపనలో పాత్ర వహించెను. (జ.ఏప్రిల్ 15, 1806)

1947:  *టేకుమళ్ళ అచ్యుతరావు,*  ప్రముఖ విమర్శకులు మరియు పండితులు. (జ.ఏప్రిల్ 18, 1880)
[వీరు రచించిన "విజయనగర ఆంధ్ర వాజ్మయ చరిత్ర", కవి జీవిత విశేషాలను, కవికృత కావ్యాల విమర్శలను సమానంగా పర్యాలోకించిన సారస్వ గ్రంథంగా పేరుపొందినది. పింగళి సూరన రచించిన గ్రంథాల గురించి వీరు ఆంగ్లంలో విపులమైన విమర్శను రచించి దానికి "పింగళి సూరనార్యుని జీవితం, కృతులు" అను ఆంగ్ల నామంతో 1941లో ప్రచురించారు. దీనిని పిఠాపురం మహారాజా సూర్యారావు బహదూరు వారికి అంకితమిచ్చారు. వీరు "ఆంధ్ర పదములు - పాటలు" మరియు "ఆంధ్ర నాటకాలు - రంగ స్థలాలు" అనే గ్రంథాల్ని కూడా రచించారు.]

1968:  *పువ్వుల సూరిబాబు,*  తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు, గాయకుడు మరియు నాటక ప్రయోక్త. (జ.ఫిబ్రవరి 22, 1915)

2016:  *అరుణ్ సాగర్,*  సీనియర్ జర్నలిస్ట్ మరియు కవి. (జ.(జనవరి 2, 1967)
[ఈయన చివరగా టీవీ5 సీఈవోగా పనిచేశాడు. గతంలో పత్రికా రంగంలో పనిచేసిన సాగర్, అనంతరం ఎలక్ట్రానిక్ మీడియాకు మారాడు. పలు ఛానళ్లలో ఉన్నత పదవులను చేపట్టాడు. మేలు కొలుపు, మ్యూజిక్ డైస్, మ్యాగ్జిమమ్ రిస్క్ కవితా సంకలనాలు ఈయనకు మంచిపేరును తెచ్చాయి. తెలుగు కవిత్వంపై తనదైన ముద్రను వేశాడు.]

2016:  *ఎం.ఎల్.నరసింహారావు,*  ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత మరియు సాహితీవేత్త. (జ.(నవంబరు 7, 1928)

2017:  *ఇరిగినేని తిరుపతినాయుడు*  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభ్యుడు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి. (జ. జూలై 1, 1937)

2019: తెలుగు సినిమా దర్శకుడు  *విజయ బాపినీడు.*  ఆయన బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించి నడిపాడు. ఆయన అనేక యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో మగమహారాజు, ఖైదీ నెం. 786 మరియు మగధీరుడు ముఖ్యమైనవి. (జ. సెప్టెంబరు 22, 1936)🙏🏻

0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top